Bigg Boss 9 Telugu: ఇమ్మాన్యుయేలే విన్నర్.. చాలా డిజప్పాయింట్ అయ్యా.. జబర్దస్త్ రోహిణి షాకింగ్ పోస్ట్

బిగ్ బాస్ సీజన్ 9పై నటి రోషిని షాకింగ్ కామెంట్స్ చేసింది. తనను ఈ సీజన్ 9(Bigg Boss 9 Telugu) చాలా డిజప్పాయింట్ చేసిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Bigg Boss 9 Telugu: ఇమ్మాన్యుయేలే విన్నర్.. చాలా డిజప్పాయింట్ అయ్యా.. జబర్దస్త్ రోహిణి షాకింగ్ పోస్ట్

Jabardasth Rohini shocking post about Emmanuel elimination.

Updated On : December 21, 2025 / 5:02 PM IST

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9పై నటి రోషిని షాకింగ్ కామెంట్స్ చేసింది. తనను ఈ సీజన్ 9 చాలా డిజప్పాయింట్ చేసిందని, ఇక్కడ కష్టపడిన వాళ్లకి ఫలితం లేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దాంతో ఆమె చేసిన ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) నుంచి టాప్ 4 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యాడు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్. ఈ విషయంలో చాలా మంది ఆడియన్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే, 15 వారాలలో తన ఆటతో ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు ఇమ్మాన్యుయేల్.

Bigg Boss 9 Telugu: కప్పు గెలవలేదు అంతే.. విన్నర్ కి ఈక్వల్ గా ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

సీజన్ మొదటి నుంచి తన కామెడీతో అందరిని కడుపుబ్బా నవ్వించాడు. అంతేకాదు, టాస్క్ ఏదైనా తన మార్క్ ఆటతో ఆకట్టుకున్నాడు. ఇవన్నీ చూసి తప్పకుండా ఈ సీజన్ విన్నర్ ఇమ్మాన్యుయేల్ అవుతాడని చాలా మంది అనుకున్నారు. అనుకోవడమే కాదు ఫిక్స్ అయ్యారు. కానీ, కనీసం టాప్ 3లో కూడా ఉండకుండా టాప్ 4 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఈ విషయాన్ని ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విదంగా ఫీలయ్యిందట నటి రోషిని.

ఈ విషయం గురించి ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “థాంక్యూ వెరీ మచ్. చాలా డిజప్పాయింట్ అయ్యాను. సీరియస్ గా చెప్తున్న. ఇమ్మాన్యూయేల్ ఎలిమినేషన్ విషయంలో ప్రతి ఆడియన్ ఇలాగే ఫీలవుతున్నాడు.బిగ్ బాస్ టీం కూడా. ఈ సీజన్ 9కి ఒక దండం. ఇక్క కష్టపడినా విలువ ఉండదని, రిజల్ట్ ఉండదని మరోసారి ప్రూవ్ చేశారు. ఎంటర్టైనర్స్ కేవలం నవ్వించడానికి మాత్రమేనని మరోసారి ప్రూవ్ చేశారు. ఇమ్మాన్యుయేల్.. నువ్వే రియల్ విన్నర్. మై డియర్ బ్రదర్ నిన్ను చేస్తే చాలా గర్వంగా ఉంది”అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Jabardasth Rohini shocking post about Emmanuel elimination. (1)

Jabardasth Rohini shocking post about Emmanuel elimination. (1)