Satya Sri : బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన సత్యశ్రీ.. ఆల్రెడీ అడిగారు..

బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందా, వస్తే వెళ్తారా అని అడగ్గా సత్యశ్రీ సమాధానమిస్తూ..

Jabardasth Satya Sri gives Clarity on Bigg Boss Entry

Satya Sri : టీవీ షోలు, సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్నవాళ్లను బిగ్ బాస్ లోకి పిలుస్తారని తెలిసిందే. అలా జబర్దస్త్ సత్యశ్రీకి కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందట. జబర్దస్త్ తో, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఫేమ్ తెచ్చుకుంది సత్యశ్రీ. ప్రస్తుతం జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చి కేవలం సినిమాలు చేస్తుంది. తాజాగా సత్యశ్రీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చింది.

Also Read : Satya Sri : ఆ సినిమా రిలీజ్ అయ్యాక పోలీసులు ఫోన్ చేసి తిట్టారు.. అప్పటికి నేను వద్దన్నా.. కానీ శేఖర్ మాస్టర్..

బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందా, వస్తే వెళ్తారా అని అడగ్గా సత్యశ్రీ సమాధానమిస్తూ.. బిగ్ బాస్ కి నన్ను ఆల్రెడీ అడిగారు. అప్పుడు ఇంట్లో పరిస్థితుల వల్ల వెళ్ళలేదు. ఇప్పుడు అడిగితే వెళ్తాను. ఈ సీజన్ అయితే కుదరదు సినిమా కమిట్మెంట్స్ ఉన్నాయి. వచ్చే సీజన్ అడిగితే మాత్రం బిగ్ బాస్ కి వెళ్తాను అని తెలిపింది. సత్యశ్రీ డైరెక్ట్ గానే ఆఫర్ మళ్ళీ వస్తే వెళ్తాను అని చెప్పింది కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా వచ్చే సీజన్ కి సత్యశ్రీ ని తీసుకొస్తారేమో చూడాలి.

Also Read : Satya Sri : చిరంజీవిని సెల్ఫీ అడిగాను.. ఆయన ఈవెంట్ అంతా అయ్యాక నా దగ్గరికి వచ్చి మరీ.. ఏడ్చేసాను..