Satya Sri : ఆ సినిమా రిలీజ్ అయ్యాక పోలీసులు ఫోన్ చేసి తిట్టారు.. అప్పటికి నేను వద్దన్నా.. కానీ శేఖర్ మాస్టర్..
తాజాగా సత్యశ్రీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆ సాంగ్ ఇష్యూ గురించి మాట్లాడింది.

Jabardasth Satya Sri Gives Clarity on Nithiin Extra Ordinary Man Movie Song Issue
Satya Sri : జబర్దస్త్ తో, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఫేమ్ తెచ్చుకుంది సత్యశ్రీ. సత్యశ్రీ నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసింది. అయితే ఈ సినిమాలో పోలీసులతో నా పెట్టె తాళం.. అనే ఓ ఐటెం సాంగ్ ని చేయించారు. దీనిపై ఆ పాట రిలీజ్ చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. పోలీసులతో అలాంటి సాంగ్ చేయించడం ఏంటని కొంతమంది పోలీసులు కూడా ఫైర్ అయ్యారు.
తాజాగా సత్యశ్రీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆ సాంగ్ ఇష్యూ గురించి మాట్లాడింది.
Also Read : Peddi : వామ్మో.. అన్ని కోట్లకు రామ్ చరణ్ ‘పెద్ది’ ఓటీటీ డీల్.. రికార్డ్ బ్రేక్ ధరకు..
సత్యశ్రీ మాట్లాడుతూ.. సినిమా రిలీజయ్యాక నాకు పోలీసుల నుంచి ఫోన్స్ వచ్చాయి. ఒక రోజు నేను పడుకున్నప్పుడు ఒక లేడీ పోలీస్ కాల్ చేసి.. ఆ సాంగ్ ఎట్లా చేస్తారు మా డ్రెస్ వేసుకొని, సిగ్గుండాలి అని తిట్టేసింది. నాకు సంబంధం లేదు. నేను ఆర్టిస్ట్ ని మాత్రమే డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్తే చేస్తాను, వాళ్ళని అడగండి అని చెప్పాను. అలా కొన్ని కాల్స్ పోలీసుల నుంచి వచ్చాయి. ఫోన్స్ చేసి తిట్టారు. నేను మూవీ యూనిట్ కి చెప్తే వాళ్ళు వదిలేసేయ్ మేము చూసుకుంటాం, ఇలాంటివి పట్టించుకోకు అన్నారు.
ఫస్ట్ నేను ఆ పాట చెయ్యను అన్నాను. వల్గర్ గా ఉంటుంది అన్నాను. నితిన్, శేఖర్ మాస్టర్, చంద్ర, వక్కంతం వంశీ ఉన్నారు. నాకు పాట ముందు చెప్పలేదు. సినిమా కమిట్ అయ్యాను కాబట్టి, డబ్బులు తీసుకున్నాను కాబట్టి చేయాల్సి వచ్చింది. ఆ స్టెప్స్ చూసి నేను వద్దు సర్ అంటే శేఖర్ మాస్టర్.. నీకు ఈ సాంగ్ చాలా ప్లస్ అవుతుంది. ఏం చేస్తున్నానో నాకు తెలీదా, నేను వల్గర్ గా కంపోజ్ చేస్తానా అని అన్నారు. సరే నాకంటూ ఒక సాంగ్ ఎవరూ పెట్టరు. ఒక సాంగ్ వచ్చింది కాబట్టి చేసేద్దాము అని ఫిక్స్ అయిపోయా.
మా ఇంట్లో ముందే చెప్పా సాంగ్ ఇలా ఉంది అని. మా నాన్న ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు సెట్ కి వచ్చారు. నా డ్యాన్స్ చూసి దీంట్లో ఏముంది బాగానే ఉంది అన్నారు. తర్వాత సాంగ్ చూసి నితిన్ గారు మీ ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయి అన్నారు. కానీ ఆ తర్వాత ఎక్కడికైనా ఈవెంట్స్ కి వెళ్తే నాకు అదే పాట వేస్తున్నారు అని తెలిపింది. ఆ సాంగ్ వల్ల తనకు సినీ పరిశ్రమలో అవకాశాల విషయంలో కూడా బాగా ప్లస్ అయింది అని చెప్పుకొచ్చింది.
Also Read : Satya Sri : చిరంజీవిని సెల్ఫీ అడిగాను.. ఆయన ఈవెంట్ అంతా అయ్యాక నా దగ్గరికి వచ్చి మరీ.. ఏడ్చేసాను..
సత్యని పోలీసులు తిట్టింది ఈ సాంగ్ చేసినందుకే..