Satya Sri : చిరంజీవిని సెల్ఫీ అడిగాను.. ఆయన ఈవెంట్ అంతా అయ్యాక నా దగ్గరికి వచ్చి మరీ.. ఏడ్చేసాను..

తను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని, తన ఫ్యామిలీ అంతా చిరంజీవి ఫ్యాన్స్ అని, చిరంజీవిని కలిసినప్పుడు ఏం జరిగింది, ఎన్ని సార్లు కలిసిందో తెలిపింది.

Jabardasth Satya Sri Tells about Meeting with Megastar Chiranjeevi

Satya Sri : జబర్దస్త్ తో, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఫేమ్ తెచ్చుకుంది సత్యశ్రీ. ప్రస్తుతం జబర్దస్త్ కి దూరమైనా సినిమాల్లో మాత్రం బిజీగానే ఉంది. తాజాగా సత్యశ్రీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని, తన ఫ్యామిలీ అంతా చిరంజీవి ఫ్యాన్స్ అని, చిరంజీవిని కలిసినప్పుడు ఏం జరిగింది, ఎన్ని సార్లు కలిసిందో తెలిపింది.

సత్యశ్రీ మాట్లాడుతూ.. తేజ్ ఐ లవ్ యు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొదటిసారి చిరంజీవి సర్ ని కలిసాను. నన్ను ఏం పేరు, ఏం క్యారెక్టర్ చేసావు అని అడిగితే చెప్పాను. ఒక్క ఫోటో సర్ సెల్ఫీ ప్లీజ్ అని అడిగాను. ఆయన ఓకే అన్నారు. కానీ అంతలోనే ఆయనని ఎవరో పిలిచారు. తర్వాత ఆయన స్పీచ్ ఇచ్చారు. ఆయన ఇంక ఆ మూడ్ లో ఉండిపోయారు. ఎవరైనా స్పీచ్ అయ్యాక, ఈవెంట్ అయ్యాక మర్చిపోయి వెళ్ళిపోతారు. కానీ ఆయన కిందకి వచ్చి ఇందాక ఎవరో ఫోటో అడిగారు అని నన్ను చూసి నువ్వే కదా రా అని పిలిచి నాకు ఫోటో ఇచ్చారు. అంతలా గుర్తుంచుకున్నారు. నేను ఇంక ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసాను ఆ రోజు.

Also Read : Solo Boy : బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ ‘సోలో బాయ్’ ట్రైలర్ వచ్చేసింది.. మిడిల్ క్లాస్ అబ్బాయిల కథ..

ఆ తర్వాత వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో సుమ అడ్డా షోలో కలిసాను. అప్పుడు మా నాన్న ఆయన సినిమాల పేర్లతో ఒక కవిత్వం రాసారు. అది ఫ్రేమ్ చేయించి ఇచ్చాను. సర్ మా నాన్న మీకు పెద్ద ఫ్యాన్, మా ఫ్యామిలీ అంతా మీ ఫ్యాన్స్. మా నాన్న రాసారు ఇది అంటే బాగుంది నా ఆఫీస్ లో పెట్టుకుంటాను అన్నారు.

ఆ తర్వాత పద్మ విసుభూషణ్ వచ్చినపుడు కలిస్తే వేంకటేశ్వరస్వామి విగ్రహం ఇచ్చాను. అది స్పెషల్ గా ఇత్తడితో చేయించి ఇచ్చాను. ఆ విగ్రహం చాలా బాగుంది ఇది బెంగుళూరు గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాను అని చెప్పారు చిరంజీవి గారు. అప్పుడు మా అమ్మని కూడా తీసుకెళ్ళాను. మా అమ్మ అయితే చిరంజీవిని చూసి ఏడ్చేసింది. కదలకుండా చిరంజీవిని అలాగే చూస్తూ ఉంది. అప్పుడు చిరంజీవి గారు నన్ను చూసి సుమ అడ్డాలో కలిసాం కదా అని అన్నారు. హమ్మయ్య చిరంజీవి గారికి నేను గుర్తున్నాను అని ఎమోషనల్ అయిపోయా. ఆయన ఒక దేవుడి లెక్కే మాకు అని తెలిపింది.

Also See : Akhil Sarthak – Rithu Chowdary : తిరుమలలో అఖిల్ సార్థక్ – రీతూ చౌదరి జంటగా.. ఫొటోలు వైరల్..