Solo Boy : బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ ‘సోలో బాయ్’ ట్రైలర్ వచ్చేసింది.. మిడిల్ క్లాస్ అబ్బాయిల కథ..
మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

Gautham Krishna Ramya Pasupuleti Solo Boy Trailer Released
Solo Boy : బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తను హీరోగా చేస్తున్న సోలో బాయ్ సినిమాని ప్రకటించి పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ఈ సోలో బాయ్ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో రమ్య పసుపులేటి, శ్వేతా అవస్థి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సోలో బాయ్ సినిమా జులై 4న రిలీజ్ కానుంది. తాజాగా సోలో బాయ్ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
Also See : Akhil Sarthak – Rithu Chowdary : తిరుమలలో అఖిల్ సార్థక్ – రీతూ చౌదరి జంటగా.. ఫొటోలు వైరల్..
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కాలేజీ లవ్ స్టోరీ, తర్వాత జాబ్ కోసం కష్టాలు పడటం, లవ్ ఫెయిల్యూర్, ఫ్యామిలీ కష్టాలు, కష్టపడి లైఫ్ లో ఎదగడం.. ఇలాంటి అంశాలతో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిల కథతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… చాలా చిన్న వయసులో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ లాంటి వ్యక్తి యొక్క కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని కోరుకున్నాము. అందుకే వారిని ఆహ్వానించాము. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ప్రేక్షకులు మాత్రమే. కాబట్టి ఇకపై వీరందరి కోసం ఏదో ఒకటి చేయాలని చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాను. సమవర్తి అనే ట్రస్టు ద్వారా నాకు వచ్చే ప్రతి సంపాదనలోనూ సగం ఆ ట్రస్టుకు అందజేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులో సగం ఆ ట్రస్టు ద్వారా ముందుగా ఒక లక్ష రూపాయలు మురళి నాయక్ గారి కుటుంబానికి అందజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ద్వారా వీలైనంతమందికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను అని తెలిపాడు.