Jabardasth Varsha : లైఫ్ లో పెళ్లి చేసుకోను.. క్లారిటీ ఇచ్చేసిన జబర్దస్త్ వర్ష.. పెళ్లి, ప్రేమపై మాట్లాడుతూ..

ప్రేమ, పెళ్లి టాపిక్ రాగా వర్ష ఆసక్తికర సమాధానం చెప్పింది.

Jabardasth Varsha Gives Clarity on Love and Marriage

Jabardasth Varsha : టీవీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వర్ష జబర్దస్త్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగానే ఉంది. వర్ష హోస్ట్ గా ఓ ఛానల్ లో ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. తాజాగా ఓ ఎపిసోడ్ లో ప్రేమ, పెళ్లి టాపిక్ రాగా వర్ష ఆసక్తికర సమాధానం చెప్పింది.

పెళ్లి చేసుకుంటావా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడగ్గా వర్ష సమాధానమిస్తూ.. నేను లైఫ్ లో అసలు పెళ్లి చేసుకోను. నాకు లవ్, పెళ్లి పై మంచి ఒపీనియన్ లేదు. లవ్, బ్రేకప్, మళ్ళీ లవ్ ఇలాంటివి అన్ని నాకు వద్దు. ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ లాగా ఒకడు ఉండేవాడు ఇప్పుడు లేడు. నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్. వాళ్ళ కోసమే బతుకుతున్నాను. ఇది ఫిక్స్ అని చెప్పింది.

Also Read : Nagarjuna : ‘కింగ్’ ని రాక్షసుడిని చేసేసారు కదరా.. ఇన్నాళ్లు హీరోని చూసారు ఇప్పుడు..

గతంలో జబర్దస్త్ లో ఇమ్మాన్యుయల్ తో లవ్ ట్రాక్ షో కోసం నడిపితే ఇద్దరూ లవ్ లో ఉన్నారేమో అనుకున్నారు కానీ కాదని క్లారిటీ ఇచ్చేసారు. ఇప్పుడు మొత్తానికే పెళ్లి చేసుకోను అని క్లారిటీగా చెప్పింది వర్ష. మరి నిజంగానే అలాగే సింగిల్ గా ఉంటుందా ఫ్యూచర్ లో మనుసు మార్చుకుంటుందా చూడాలి.