Nagarjuna : ‘కింగ్’ ని రాక్షసుడిని చేసేసారు కదరా.. ఇన్నాళ్లు హీరోని చూసారు ఇప్పుడు..

కూలి సినిమా నుంచి రిలీజయిన నాగార్జున లుక్స్ కి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

Nagarjuna : ‘కింగ్’ ని రాక్షసుడిని చేసేసారు కదరా.. ఇన్నాళ్లు హీరోని చూసారు ఇప్పుడు..

Nagarjuna Plays Main Villain Role in Rajinikanth Coolie Movie

Updated On : June 17, 2025 / 8:37 PM IST

Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటే డిఫరెంట్ పాత్రలకు పెట్టిన పేరు. ఆయన చేసినన్ని వేరియేషన్స్ ఆ తరం హీరోల్లో ఎవరూ చేయలేదనే చెప్పొచ్చు. శివ, అన్నమయ్య, గీతాంజలి, హలో బ్రదర్, రాజు గారి గది.. ఇలా ఢిఫెరెంట్ జానర్స్ లో ఎంతోమంది డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని మెప్పించారు. ఇప్పుడు కూడా ఢిఫెరెంట్ పాత్రలు చేస్తున్నారు.

సోలో మెయిన్ హీరోగానే కాకుండా వేరే హీరోలతో కూడా కలిసి సినిమాలు చేసారు మొదట్నుంచి. నాని, కార్తీ.. ఇలా పలు హీరోలతో సినిమాలు చేసారు. ఇప్పుడు ధనుష్ తో కలిసి నాగార్జున కుబేర సినిమాతో జూన్ 20న రాబోతున్నాడు. ఆ తర్వాత రజినీకాంత్ తో కలిసి కూలి సినిమాతో రాబోతున్నాడు.

Also Read : Raja Saab Set Photos : ప్రభాస్ ‘రాజాసాబ్’ హారర్ సెట్ ఫొటోలు చూశారా?

కూలి సినిమా నుంచి రిలీజయిన నాగార్జున లుక్స్ కి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. నాగ్ ఈ సినిమాలో మరింత స్టైలిష్ గా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నాగార్జున కీ రోల్ కాదంట ఏకంగా మెయిన్ విలన్ అంట. రాక్షసుడిలా చూపిస్తున్నారంట అని రివీల్ చేసేసారు. కుబేర ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఈ విషయాన్ని తెలిపాడు.

నాగార్జున మాట్లాడుతూ.. ఒకసారి లోకేష్ కనగరాజ్ నన్ను కలిసినప్పుడు విలన్ క్యారెక్టర్ చేస్తారా అని అడిగాడు. మీరు ఒప్పుకోకపోయినా పర్లేదు మీతో కాసేపు మాట్లాడి ఓ కాఫీ తాగి వెళ్ళిపోతాను అన్నాడు. నేను కథ చెప్పమంటే లోకేష్ కథ చెప్పిన కాసేపటికే నాకు నచ్చింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 7 సార్లు నేరేషన్ ఇచ్చాడు. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అని లోకేష్ ని అడిగితే మనుషులు రాక్షసులు అని చెప్పినట్లు తెలిపాడు.

Also Read : Ramayanam : వామ్మో.. బాలీవుడ్ రామాయణంలో ఇంతమంది స్టార్స్.. పాతిక మందితో.. ఎవరెవరు ఏ పాత్రలో.. రణబీర్ సాయి పల్లవితో పాటు కాజల్, రకుల్, అమితాబ్..?

దీంతో నాగార్జున కూలి సినిమాలో ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇన్నేళ్లు హీరోగా మెప్పించిన నాగార్జున ఫుల్ నెగిటివ్ షేడ్స్ లో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఫ్యాన్స్ నాగార్జునని నెగిటివ్ పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారో. మొత్తానికి మన కింగ్ ని కూలి సినిమాతో రాక్షసుడిగా చూపించబోతున్నారు అని తెలుస్తుంది.