Ramayanam : వామ్మో.. బాలీవుడ్ రామాయణంలో ఇంతమంది స్టార్స్.. పాతిక మందితో.. ఎవరెవరు ఏ పాత్రలో.. రణబీర్ సాయి పల్లవితో పాటు కాజల్, రకుల్, అమితాబ్..?

బాలీవుడ్ లో ఇప్పుడు అంతా రామాయణం గురించే చర్చిస్తున్నారు.

Ramayanam : వామ్మో.. బాలీవుడ్ రామాయణంలో ఇంతమంది స్టార్స్.. పాతిక మందితో.. ఎవరెవరు ఏ పాత్రలో.. రణబీర్ సాయి పల్లవితో పాటు కాజల్, రకుల్, అమితాబ్..?

Ranbir Sai Pallavi Yash Bollywood Ramayanam Having So Many Stars Including Amitabh Rakul Kajal Vijay Sethupathi Vivek Oberoi

Updated On : June 17, 2025 / 7:48 PM IST

Ramayanam : బాలీవుడ్ లో భారీగా రామాయణం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాణంలో నితేష్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో దాదాపు 25 మంది స్టార్స్ నటిస్తున్నారని వార్త వైరల్ అవుతుంది.

బాలీవుడ్ లో ఇప్పుడు అంతా రామాయణం గురించే చర్చిస్తున్నారు. రణబీర్, సాయి పల్లవి, యశ్ లతోనే ఈ సినిమా భారీగా ఉందంటే కాజల్, రకుల్, అమితాబ్, వివేక్ ఒబెరాయ్.. లాంటి చాలా మంది స్టార్స్ ఇందులో నటిస్తున్నారని వారి పాత్రలతో సహా వైరల్ అవుతుంది.

Also Read : Raja Saab Set Photos : ప్రభాస్ ‘రాజాసాబ్’ హారర్ సెట్ ఫొటోలు చూశారా?

రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సమాచారం ప్రకారం సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, అరుణ్ గోవిల్ దశరథుడిగా, ఇందిరా కృష్ణన్ కౌసల్యగా, లారా దత్తా కైకేయిగా, అనిల్ కపూర్ జనకుడిగా, అమితాబ్ జటాయువుగా, ఆదినాథ్ కొఠారి భరతుడిగా, షీబా చద్దా మంథరగా, బాబీ డియోల్ కుంభకర్ణుడిగా, విజయ్ సేతుపతి విభీషణుడిగా, విక్రాంత్ మెస్సే మేఘనాధుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, కాజల్ మండోదరిగా, మోహిత్ రానా శివుడిగా, కునాల్ కపూర్ ఇంద్రుడిగా, వివేక్ ఒబెరాయ్ విద్యుత్జిహ్వుడిగా నటించబోతున్నట్టు సమాచారం. వీళ్ళే కాకుండా మరికొంతమంది స్టార్స్ కూడా వివిధ పాత్రల్లో కనిపించబోతున్నారట.

దీంతో రామాయణాన్ని భారీగానే తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. మరి నిజంగానే ఇంతమంది స్టార్స్ నటిస్తున్నారా లేదా తెలియాలంటే రామాయణం వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. రామాయణం మొదటి పార్ట్ దీపావళి 2026లో విడుదల చేయనుండగా, రెండవ భాగం దీపావళి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Supreme Court : ఫ్లాప్ సినిమాను రిలీజ్ చేయమన్న సుప్రీం కోర్ట్.. రిలీజ్ చేస్తారా?