Supreme Court : ఫ్లాప్ సినిమాను రిలీజ్ చేయమన్న సుప్రీం కోర్ట్.. రిలీజ్ చేస్తారా?
కర్ణాటక హైకోర్టులో వేసిన పిటిషన్ ని నిర్మాత సుప్రీంకోర్టుకు బదిలీ చేయడంతో నేడు సుప్రీం కోర్ట్ ఈ సినిమా వివాదంపై తీర్పు ఇచ్చింది.

Supreme Court Verdict on Kamal Haasan Thug Life Banned in Karnataka
Supreme Court : ఇటీవల మణిరత్నం – కమల్ హాసన్ కాంబోలో థగ్ లైఫ్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 5న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. కానీ ఈ సినిమాకు తీవ్ర విమర్శలు వచ్చాయి. సినిమాను ఫ్లాప్ చేసారు ప్రేక్షకులు. అసలు మణిరత్నం – కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ కలిసి ఇలాంటి సినిమా తీయడం ఏంటి అని ట్రోల్స్ వచ్చాయి. అయితే సినిమా రిలీజ్ సమయంలో కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలతో కర్ణాటకలో వివాదం చెలరేగింది.
కన్నడ ప్రజలు, రాజకీయ నాయకులు కమల్ పై ఫైర్ అయ్యారు. కన్నడ ఫిలిం ఛాంబర్ థగ్ లైఫ్ సినిమాని బ్యాన్ చేసింది. క్షమాపణలు చెప్తే రిలీజ్ చేయండి అంటే నేను చెప్పను అని కమల్ అనడంతో కన్నడ వివాదం మరింత పెద్దగా అయింది. కర్ణాటక హైకోర్టు కూడా కమల్ సారీ చెప్పాల్సిందే అని తీర్పు ఇచ్చింది. దీంతో కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయలేదు. అయితే కర్ణాటక హైకోర్టులో వేసిన పిటిషన్ ని నిర్మాత సుప్రీంకోర్టుకు బదిలీ చేయడంతో నేడు సుప్రీం కోర్ట్ ఈ సినిమా వివాదంపై తీర్పు ఇచ్చింది.
Also Read : Tamannaah : ‘బాహుబలి’లో తమన్నాకు డూప్ గా.. మొదట చేయను అన్నా.. నా యాటిట్యూడ్ చూసి..
థియేటర్స్ లో సినిమా ప్రదర్శించే నిర్ణయం ఏ సంఘాలకు లేదు. కమల్ హాసన్ అన్న మాటలతో మీకు సమస్య కావచ్చు కానీ సినిమాని ఆపే హక్కు లేదు. ఒకసారి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత సినిమాని విడుదల చేయాల్సిందే. సినిమా రిలీజ్ చేసాక దాన్ని చూడాలా వద్దా అనేది ప్రజల ఇష్టం. బెదిరింపులను ఆధారంగా చేసుకొని సినిమాని ఆపకూడదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. సినిమాని కర్ణాటకలో రిలీజ్ చేయనివ్వాలి అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ప్రశ్నించింది సుప్రీం కోర్ట్.
అయితే తీర్పు ఇచ్చారు కానీ సినిమా ఎలాగో ఫ్లాప్ అయింది కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాని మూవీ యూనిట్ రిలీజ్ చేస్తారా లేదా చూడాలి. ఇంకో 20 రోజుల్లో ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో రిలీజ్ చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి సుప్రీం కోర్టు తీర్పు పై కన్నడ సంఘాలు, కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఎలా స్పందిస్తాయో చూడాలి.
Also Read : Sri Satya : అమ్మకు పక్షవాతం.. లైఫ్ లాంగ్ అంతే.. అప్పుడే బ్రేకప్.. శ్రీసత్య ఎమోషనల్..