Sri Satya : అమ్మకు పక్షవాతం.. లైఫ్ లాంగ్ అంతే.. అప్పుడే బ్రేకప్.. శ్రీసత్య ఎమోషనల్..

శ్రీ సత్య తన తల్లి పక్షవాతం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.

Sri Satya : అమ్మకు పక్షవాతం.. లైఫ్ లాంగ్ అంతే.. అప్పుడే బ్రేకప్.. శ్రీసత్య ఎమోషనల్..

Sri Satya gets Emotional while Tells about her Mother Paralysis

Updated On : June 17, 2025 / 3:34 PM IST

Sri Satya : సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సత్య బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలు చేస్తుంది. తాజాగా ఆహా కాకమ్మ కథలు షోకి వచ్చింది. ఈ షోలో శ్రీ సత్య తన తల్లి పక్షవాతం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.

గతంలో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు శ్రీ సత్య తల్లిని వీడియో కాల్ లో చూపించారు. అప్పుడే ఆమెకు పక్షవాతం అని తెలిసింది.

Also Read : Ye Maaya Chesave : ‘ఏ మాయ చేసావే’ రీ రిలీజ్.. సామ్ – చైతూలకు అయినా తెలుసా? అసలు మూవీ యూనిట్ కి సంబంధం లేకుండా..

శ్రీ సత్య మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచి నేను ఏమి పట్టించుకునే టైపు కాదు. తిన్నామా, మన పని మనం చేసుకున్నామా అనే ఉండేదాన్ని. దేన్నీ సీరియస్ గా తీసుకోలేదు. ఆరేళ్ళ క్రితం అమ్మకు పక్షవాతం వచ్చింది. అప్పుడే లవ్ బ్రేకప్ అయింది. అక్క పెళ్లి చేసుకొని హైదరాబాద్ కి వెళ్లిపోయింది. అప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం. కరోనా సమయంలో మా అమ్మ హాస్పిటల్ లో నేను హాస్పిటల్ బయట ఉండేదాన్ని. నాన్నకు షుగర్ ఉండటంతో బయట ఎక్కువ తిరగలేరు. ఆ సమయంలో బాధ్యతల విలువ బాగా తెలిసింది. లైఫ్ లాంగ్ అమ్మకు పక్షవాతం అలాగే ఉంటుంది. అలాంటి సమయంలోనే మనుషులు ఎలా ఉంటారో తెలుసుకున్నా అంటూ ఎమోషనల్ అయింది.

Also Read : Miheeka – Sreeleela : రానా భార్య – శ్రీలీల ఇంత క్లోజా.. శ్రీలీలతో మిహీక ఫొటోలు.. లవ్ యు అక్క అని రిప్లై..