Ye Maaya Chesave : ‘ఏ మాయ చేసావే’ రీ రిలీజ్.. సామ్ – చైతూలకు అయినా తెలుసా? అసలు మూవీ యూనిట్ కి సంబంధం లేకుండా..
తాజాగా ఏ మాయ చేసావే సినిమా రీ రిలీజ్ అని అనౌన్స్ చేసారు.

Samantha Naga Chaitanya Ye Maaya Chesave Re Release with out Involving Movie Unit
Ye Maaya Chesave : ఇటీవల అనేక పాత సినిమాలు, హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మూవీ యూనిట్స్ అధికారికంగా రీ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి స్పందన బాగానే ఉంటుంది. కానీ రీ రిలీజ్ లు ఇటీవల కేవలం ఫ్యాన్స్ కోసం, థియేటర్స్ లో డ్యాన్సులు, హడావిడి చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాళ్ళ కోసమే రిలీజ్ అవుతున్నట్టు ఉన్నాయి.
కొన్ని రీ రిలీజ్ లకు జనాలు బాగా రావడంతో కొంతమంది థర్డ్ పార్టీ వాళ్ళు డబ్బుల కోసం థియేటరికల్ రైట్స్ కొనుక్కొని రీ రిలీజ్ అని కొన్ని థియేటర్స్ లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా ఇటీవల కాలంలో ఏ సినిమాలు పడితే అవి రీ రిలీజ్ అవుతున్నాయి. ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ కూడా వద్దు బాబోయ్ అంటున్నారు.
తాజాగా ఏ మాయ చేసావే సినిమా రీ రిలీజ్ అని అనౌన్స్ చేసారు. జులై 18 ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ రీ రిలీజ్ కి మూవీ యూనిట్ కి సంబంధం లేదు. ఓ ప్రైవేట్ వ్యక్తి ఈ సినిమా రైట్స్ కొనుక్కొని ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి డబ్బుల కోసం రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ రీ రిలీజ్ పై సమంత, నాగ చైతన్య, గౌతమ్ మీనన్, నిర్మాతలు కానీ ఎవరూ స్పందించలేదు. ఫ్యాన్స్ మాత్రం ఇది సమంత – నాగ చైతన్య కాంబో సినిమా కావడం, సమంత ఫస్ట్ సినిమా కావడంతో పాటు సినిమాలో సాంగ్స్ కూడా బాగుంటాయి కాబట్టి థియేటర్లో వైబ్ అవ్వొచ్చని పలువురు ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.
అసలు ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో కూడా ఎవ్వరికి తెలియదని సమాచారం. మరి ఏ మాయ చేసావే సినిమా రీ రిలీజ్ కి ఏ రేంజ్ లో ప్రేక్షకులు వస్తారో చూడాలి. అంతటా రిలీజ్ చేయకపోయినా హైదరాబాద్ లో ఓ రెండు మూడు థియేటర్స్ లో రిలీజ్ చేసి ఫ్యాన్స్ వరకు రప్పించుకోగలుగుతారేమో.
Also Read : Samantha : సమంతని ఇబ్బంది పెట్టిన వీడియోగ్రాఫర్స్.. స్టాప్ ఇట్ అని సీరియస్ అయి వెళ్లిపోయిన సామ్..