Samantha : సమంతని ఇబ్బంది పెట్టిన వీడియోగ్రాఫర్స్.. స్టాప్ ఇట్ అని సీరియస్ అయి వెళ్లిపోయిన సామ్..
సమంత ప్రస్తుతం ఎక్కువగా ముంబై లో ఉంటున్న సంగతి తెలిసిందే.

Samantha Serious on Videographers in Mumbai after her Gym
Samantha : బాలీవుడ్ లో సెలబ్రిటీలు జిమ్, రెస్టారెంట్, మూవీ ప్రమోషన్స్, బయట ఎక్కడికి వెళ్లినా వాళ్ళని ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ ఉంటారని తెలిసిందే. వాళ్లనే పాపరాజీస్ అంటారు. అయితే తాజాగా సమంత ఆ పాపరాజీస్ తో ఇబ్బంది పడింది.
సమంత ప్రస్తుతం ఎక్కువగా ముంబై లో ఉంటున్న సంగతి తెలిసిందే. ముంబైలో నేడు ఉదయం సమంత జిమ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఆమెని వీడియోలు, ఫోటోలు తీయడానికి పాపరాజీస్ ఎగబడ్డారు. సమంత జిమ్ బయట తన కార్ కోసం వెతుక్కుంటుంటే తనను ఫోటోలు, వీడియోలు తీస్తుండటంతో ఇబ్బందిపడి తాను చాలు అన్నా ఇంకా తీస్తుండటంతో స్టాప్ ఇట్ అంటూ వాళ్లపై సీరియస్ అయి వెళ్ళిపోయింది. దీంతో సమంత వీడియో వైరల్ గా మారింది.
Also Read : Puri Jagannadh : అఫీషియల్.. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో మరో నటి..
ఇక సమంత ఇటీవలే నిర్మాతగా శుభం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే తన నిర్మాణ సంస్థలోనే ఒక సినిమా చేస్తుంది.