Tamannaah : ‘బాహుబలి’లో తమన్నాకు డూప్ గా.. మొదట చేయను అన్నా.. నా యాటిట్యూడ్ చూసి..
కొంత మంది నటీనటులు స్టార్ హీరో హీరోయిన్స్ కి డూప్ గా కూడా చేస్తారు.

Bhanu Sri says she acted Dupe for Tamannaah Bhatia in Baahubali
Tamannaah : మన హీరోలకు, హీరోయిన్స్ కి డూప్ లు ఉంటారని తెలిసిందే. చాలామంది స్టార్స్ యాక్షన్ సీన్స్, ఫేస్ కనిపించకుండా ఉండే షాట్స్, సజెషన్ షాట్స్ లో చాలా వరకు డూప్స్ ని వాడతారు. డూప్ లు కొంతమంది బయటి వాళ్ళే ఉంటే కొంతమంది సినీ పరిశ్రమ వాళ్ళు కూడా ఉంటారు. కొంత మంది నటీనటులు స్టార్ హీరో హీరోయిన్స్ కి డూప్ గా కూడా చేస్తారు.
తాజాగా బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ బాహుబలి సినిమాలో తమన్నాకు డూప్ గా చేసాను అని తెలిపింది. అయితే బాహుబలి సినిమాలో తమన్నా ఫ్రెండ్స్ లో ఒక క్యారెక్టర్ కూడా చేసింది భానుశ్రీ. ఆ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
భానుశ్రీ మాట్లాడుతూ.. నేను డ్యాన్సర్ గా చేస్తున్నప్పుడు తమన్నాకు డూప్ గా చేయమని ఛాన్స్ వచ్చింది. అది బాహుబలి సినిమా అని నాకు తెలీదు. మొదట చేయను అన్నాను. తర్వాత వాళ్ళు రెమ్యునరేషన్ బాగా ఇస్తామని చెప్పడంతో ఓకే చెప్పాను. సెట్ కి వెళ్ళాక అది బాహుబలి సినిమా అని తెలిసింది. 17 రోజులు తమన్నాకు డూప్ గా నటించాను. ఆ తర్వాత నా యాటిట్యూడ్, యాక్టింగ్ చూసి తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ కి తీసుకున్నారు వాళ్ళే అని తెలిపింది.