Jabardasth Varsha got Emotional in a Interview while Tells about her sad things
Jabardasth Varsha : సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వర్ష ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది. జబర్దస్త్ లో స్కిట్స్ తో, ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ, లవ్ ట్రాక్స్ చేసి వైరల్ అయింది. బయట ఈవెంట్స్ తో, తన సోషల్ మీడియా ఫొటోలతో కూడా జబర్దస్త్ వర్ష ఫాలోయింగ్ పెంచుకుంది.
వర్ష ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ కి యాంకర్ గా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లు చేస్తుంది. తాజాగా చేసిన ఓ ఇంటర్వ్యూలో తను పడ్డ కష్టాలు కూడా చెప్పుకొచ్చింది వర్ష.
వర్ష మాట్లాడుతూ.. నన్ను కూడా కొంతమంది చాలా బాధపెట్టారు. నా ముందు ఒకలా, నా వెనక ఒకలా ఉండేవాళ్ళు. కావాలని బాధపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలిసిన వాళ్ళే అలా చేసేవాళ్ళు. ఆరేడేళ్ల క్రితం ఓ ఈవెంట్ ఉందని, డ్యాన్స్ ప్రోగ్రాం అని పిలిచారు. నేనే ఫ్లైట్ టికెట్ పెట్టుకొని వెళ్ళాను. అక్కడ వసతులు సరిగ్గా లేవు. వేరే ఆర్టిస్టులు అందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసేస్తున్నారు. కనీసం నాకు ప్రాక్టీస్ కూడా చేయించలేదు. స్టేజ్ వెనక ఆర్టిస్టులు అప్పటికి రెడీ అవ్వడానికి ఒక గుడిసె వేశారు. ఆ చిన్న గుడిసెలోనే కూర్చొని ఉన్నాను. స్టేజి మీద అందరి ప్రోగ్రామ్స్ చేసేస్తున్నారు కానీ నన్ను పిలవలేదు. నన్ను అలా స్టేజి వెనకాలే ఉంచారు. అంతలో ఓ ఆర్టిస్ట్ వచ్చి రెడీ అవుతాను కాసేపు అద్దం పట్టుకోమని అడిగారు. అలా గంట సేపు ఆర్టిస్ట్ కి అద్దం పట్టుకొని నిల్చున్నాను. ఇది కావాలని చేసారు. నా ప్రోగ్రాం ఏం లేకపోయినా ఉందని చెప్పి, నన్ను రప్పించి బాధపెట్టారు అంటూ ఎమోషనల్ అయింది.
అయితే జబర్దస్త్ తో పేరొచ్చాక తన పరిస్థితి మారిందని, పేరు, గౌరవం, డబ్బు అన్ని వచ్చాయని తెలిపింది. కానీ ఇప్పటికి కూడా కొంతమంది ముందు ఒకలా వెనక ఒకలా ఉంటున్నారు. దాంతో నేను ఇబ్బందులు పడుతున్నాను అంటూ తెలిపింది జబర్దస్త్ వర్ష. అయితే తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు మాత్రం చెప్పలేదు.