Ashu Reddy : వామ్మో.. అషురెడ్డి దగ్గర అంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఉందా..? అంత పెట్టి కొన్నాను అని వాళ్ళ అమ్మకు చెప్తే..
తన షాపింగ్ గురించి, తన దగ్గరున్న ఖరీదైన బ్యాగ్ గురించి మాట్లాడింది అషురెడ్డి.

Do You Know how much cost of Ashu Reddy costly Handbag
Ashu Reddy : సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన అషురెడ్డి బిగ్ బాస్ తర్వాత మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో, వీడియోలతో రెగ్యులర్ గా ఫాలోవర్స్ ని అలరిస్తుంది.
తాజాగా అషురెడ్డి ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. తన షాపింగ్ గురించి, తన దగ్గరున్న ఖరీదైన బ్యాగ్ గురించి మాట్లాడింది.
Also Read : Ashu Reddy : అషురెడ్డిలో ఇంత బాధ ఉందా.. బ్రెయిన్ ట్యూమర్.. రాత్రికి రాత్రి సర్జరీ.. హెయిర్ తీసేసి..
వేరే దేశాలకు వెళ్తే షాపింగ్ ఏం చేస్తావ్ అని అడగ్గా అషురెడ్డి మాట్లాడుతూ.. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు షాపింగ్ ఎక్కువగా చేస్తాను. ఎక్కువ బ్యాగ్స్ కొంటాను. ఆ తర్వాత చెప్పులు, డ్రెస్ లు. నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ విలువ 2 లక్షలు. ఆ బ్యాగ్ కొన్నాక మా అమ్మకి చెప్తే నాకు దెబ్బలు కూడా పడ్డాయి. బ్యాగ్ ని విసిరికొట్టింది. బ్యాగ్ ని కాల్చేసింది కూడా. కానీ అది ప్యూర్ లెదర్ కావడంతో కాలలేదు అని తెలిపింది.
దీంతో అషురెడ్డి రెండు లక్షలు పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొందా అని ఆశ్చర్యపోతున్నారు ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్.