Jackie Shroff
Jackie Shroff : బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ సినిమాలకు దూరంగా ఉన్నా తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు. సోషల్ మీడియాలో తరచు సంప్రదాయ వంటకాల గురించి వివరించే జగ్గు దాదా ఈసారి కొత్తరకం వంటకం గురించి చెప్పారు.
Jackie Shroff : పేదరికం కుటుంబాన్ని దగ్గరగా ఉంచుతుందన్న జాకీష్రాఫ్ వీడియో వైరల్
జాకీ ష్రాఫ్ 66 ఏళ్ల ఈ బాలీవుడ్ నటుడు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. కారణం ఏంటనేది తెలియదు కానీ.. అభిమానులకు మాత్రం రకరకాల వంటకాల గురించి వివరిస్తూ దగ్గరగానే ఉన్నారు. సోషల్ మీడియాలో రకరకాల రెసిపీల తయారీ గురించి చెప్పే జాకీ ష్రాఫ్ లేటెస్ట్‌గా ఓ రేడియో ప్రోగ్రాంలో ‘కాంద భిండి’ అనే వంటకం గురించి చెప్పారు. ఉల్లిపాయ, బెండకాయలతో దానిని ఎలా తయారు చేసుకోవాలో ఆయన వివరించిన తీరు ఫుడ్ వ్లాగర్లు శివంగి, అర్జున్‌లకు నచ్చింది. జాకీ ష్రాఫ్ చెబుతున్న తయారీ విధానం వీడియో ఫాలో అవుతూ వారు దానిని తయారు చేసారు.
Jackie Shroff : జాకీ ష్రాఫ్‌ను వెంటాడే గతం.. ఇంత విషాదమా?
పాన్‌లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు అందులో వేయించాక తరిగిన వెల్లుల్లి, లవంగాలు వేసి.. రుచికి సరిపడా ఉప్పు వేయడంతో రెసిపీ వండటం పూర్తవుతుంది. రోటీతో దీనిని సెర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందట. thefoodwassogood అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ‘ది లెజెండ్ ‘కాంద భిండి’ సూఖ’ రెసిపీ’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు. నెటిజన్లు జాకీష్రాఫ్ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని అభినందించారు. ఇంతకు ముందు ఆయన చెప్పిన ‘అండ కారి పట్టా’ రెసిపీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.