Jagadeka Veerudu Athiloka Sundari Child Artists Meet Megastar Chiranjeevi Photo goes Viral
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో శ్రీదేవితో కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ తో కలిసి పలువురు పిల్లలు నటించారు. 34 ఏళ్ళ క్రితం ఈ సినిమాలో నటించిన పిల్లలు అంతా ఇప్పుడు పెద్దవాళ్ళు అయి ఇటీవల మెగాస్టార్ ని కలిశారు. షామిలి, షాలిని, రిచర్డ్ రిషి ఈ ముగ్గురు కూడా చిరంజీవిని కలిశారు.
ఈ ముగ్గురు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో నటించారు. ఇక షామిలి, షాలిని, రిచర్డ్ రిషి పెద్దయ్యాక కూడా నటించారు. షాలిని ఓయ్ సినిమాలో మెప్పించింది. ఆ తర్వాత తమిళ్ స్టార్ హీరో అజిత్ ని పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. 34 ఏళ్ళ తర్వాత ఇటీవల మళ్ళీ చిరంజీవిని ఈ ముగ్గురు కలవడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
Also Read : Sreeleela : హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలీల.. సీతలా ఎంత చక్కగా ఉంది..
షాలిని చిన్నప్పుడు ఈ ముగ్గురు చిరంజీవితో దిగిన ఫోటో, ఇప్పుడు దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి సంతోషం వ్యక్తం చేసింది. ఇక ముగ్గురు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ అని తెలిసిందే. ఇటీవలే షాలిని భర్త, తమిళ్ స్టార్ హీరో అజిత్ చిరంజీవిని విశ్వంభర సెట్లో కలిసిన సంగతి తెలిసిందే.