Sreeleela : హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలీల.. సీతలా ఎంత చక్కగా ఉంది..
తాజాగా శ్రీలీల ఓ పల్లెటూరి అమ్మాయిలా, పాత సినిమాల్లో హీరోయిన్ లా తయారయిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Sreeleela Shares Photos in Retro Looks she Acted in Hanu Raghavapudi Direction
Sreeleela : శ్రీలీల సడెన్ గా దూసుకొచ్చి వరుస సినిమాలతో టాలీవుడ్ లో సందడి చేసింది. ఒక్కసారిగా తన డ్యాన్స్, నటనతో బాగా పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది శ్రీలీల. ప్రస్తుతం ఈ కన్నడ భామ ఓ పక్క తన చదువు పూర్తిచేసే పనిలో ఉండగా మరోపక్క నిదానంగా సినిమాలు చేస్తుంది. తాజాగా శ్రీలీల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో నటించింది.
సీతారామం లాంటి సినిమాతో ఇటీవల హను రాఘవపూడి అందర్నీ మెప్పించారు. ఆయన సినిమాలన్నీ కూడా అంతే క్లాసిక్ గా ఉంటాయి. తాజాగా శ్రీలీల ఓ పల్లెటూరి అమ్మాయిలా, పాత సినిమాల్లో హీరోయిన్ లా తయారయిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read : Anchor Syamala : నాకు భయమేస్తుంది.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు..
శ్రీలీల ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. రెట్రో షేడ్స్ ని హత్తుకున్నాను. ఒక నటిగా డిఫరెంట్ లుక్స్ ట్రై చేయడం ఆనందంగా ఉంటుంది. ఈ లుక్స్ లో నేను చాలా కొత్తగా కనిపించాను. ఇది ఒక యాడ్ షూటింగ్ కోసం మాత్రమే. హను రాఘవపూడి గారికి నన్ను ఇలా చూపించినందుకు థ్యాంక్యూ అని పోస్ట్ చేసింది. దీంతో శ్రీలీల రెట్రో లుక్స్ ఫోటోలు వైరల్ గా మారాయి. మరి ఆ యాడ్ ఏంటో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.