Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న జగపతి బాబు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా దూసుకుపోతున్నాడు. అప్పుడప్పుడు టీవీ షోలలో సరదాగా కనిపిస్తున్నారు. జగపతి బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ లో శుభలగ్నం సినిమా ఒకటి. తాజాగా ఓ టీవీ షోకి రాగా జగపతి బాబు శుభలగ్నం రిలీజ్ అయిన తర్వాత తనకు ఎదురైన ఓ అనుభవం తెలిపారు.
జగపతి బాబు తాజాగా జీ తెలుగులో వస్తున్న డ్రామా జూనియర్స్ షోకి గెస్ట్ గా వచ్చారు. ఆమని కూడా గెస్ట్ గా వచ్చారు. ఈ షోకి అనిల్ రావిపూడితో పాటు రోజా జడ్జిగా చేస్తుంది. జగపతి బాబు – ఆమని – రోజా ఈ ముగ్గురు కలిసే శుభలగ్నం సినిమా చేసారు. ఈ ముగ్గురు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కలిసి కనపడటంతో ఆ సినిమా గురించి పలు జ్ఞాపకాలు పంచుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.
ఈ ప్రోమోలో జగపతి బాబు శుభలగ్నం సినిమా తర్వాత జరిగిన ఓ సంఘటన గురించి చెప్తూ.. శుభలగ్నం సినిమా రిలీజయిన కొద్ది రోజులకే ఓ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. అక్కడ జనాల్లో కొంతమంది ఒరే.. వీడినేరో పెళ్ళాం అమ్మేసింది కోటి రూపాయలకు వీడినే.. అని అరిచారు అంటూ తెలిపారు. అప్పట్లో సినిమా జనాల్లో అంత బాగా కనెక్ట్ అయిందని ఆ సంఘటనతో తెలుస్తుంది.
శుభలగ్నం సినిమాలో ఆమని పాత్ర కోటి రూపాయలకు రోజాకి జగపతి బాబుని అమ్మేస్తుంది. అప్పట్లో అది కొత్త పాయింట్ అవ్వడంతో జనాల్లోకి బాగా వెళ్ళింది. SV కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కింది. అప్పటి సంఘటనని ఇప్పుడు పంచుకోవడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారో చూడాలి. మీరు కూడా జగపతి బాబు ప్రోమో చూసేయండి..
Also Read : Allu Arjun : ప్రపంచాన్ని కాపాడబోతున్న బన్నీ.. అల్లు అర్జున్ – అట్లీ సినిమా కథ ఇదేనా..?