Allu Arjun : ప్రపంచాన్ని కాపాడబోతున్న బన్నీ.. అల్లు అర్జున్ – అట్లీ సినిమా కథ ఇదేనా..?
త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్న ఈ సినిమా గురించి తాజాగా తమిళ మీడియాలో ఓ రూమర్ వినిపిస్తుంది.

Allu Arjun Atlee Movie Hollywood Range Story Rumors goes Viral
Allu Arjun : ఇటీవలే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాని ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు. ఆ వీడియో లో అల్లు అర్జున్, అట్లీ హాలీవుడ్ వెళ్లి అక్కడ VFX నిపుణులతో మాట్లాడటం, అక్కడి VFX
సంస్థలు చూపించడంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.
నిర్మాణ సంస్థ రిలీజ్ చేసిన వీడియోతో దీంతో హాలీవుడ్ రేంజ్ లో భారీ గ్రాఫిక్స్ ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. ఎవెంజర్స్, అవతార్, స్పైడర్ మ్యాన్, టర్మినేటర్.. లాంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సంస్థలు అల్లు అర్జున్ సినిమాకు పనిచేయబోతున్నాయి. ఈ సినిమాకు దాదాపు 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని సమాచారం. అందులో గ్రాఫిక్స్ కే దాదాపు 150 కోట్ల వరకు పెట్టబోతున్నారట.
త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్న ఈ సినిమా గురించి తాజాగా తమిళ మీడియాలో ఓ రూమర్ వినిపిస్తుంది. మాస్ కమర్షియల్ సినిమాలు తీసే అట్లీ ఈసారి కొత్తగా భారీగా హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక ఏజెంట్ అని, ఇది ఒక టైం ట్రావెలింగ్ సినిమా అని, హీరో ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్ కి టైం ట్రావెల్ చేస్తాడని, ఒక మిషన్ కోసం టైం ట్రావెల్ చేసి ప్రపంచాన్ని కాపాడతాడని తెలుస్తుంది. ఈ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ కూడా ఉండబోతుందట. మరి అసలు కథ ఇదేనా కాదో తెలీదు కానీ టైం ట్రావెల్ అయితే అల్లు అర్జున్ కి సరికొత్తగా ఉంటుంది, హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో ఇండియాతో పాటు బయటి దేశాల్లోనూ భారీగా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ సినిమా 2027 లో రిలీజ్ అవుతుంది అని వినిపిస్తుంది.
Also Read : Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది.. ఇడియట్ స్టెప్పులతో అదరగొట్టిన మాస్ మహారాజ..