Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది.. ఇడియట్ స్టెప్పులతో అదరగొట్టిన మాస్ మహారాజ..
రవితేజ, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా నుంచి తు మేరా లవర్ అనే సాంగ్ రిలీజ్ చేసారు.

Mass Maharaja Raviteja Sreeleela Mass Jathara Mass Song Released
Mass Jathara Song : రవితేజ, శ్రీలీల జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మాస్ జాతర. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా తు మేరా లవర్ అనే సాంగ్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
ఈ పాటను భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో భాస్కరభట్ల రాయగా AI ఉపయోగించి దివంగత సింగర్ చక్రి వాయిస్ తో పాడించారు. భాను మాస్టర్ ఈ సాంగ్ కి డ్యాన్స్ కంపోజ్ చేసారు.
Also Read : Vassishta : మోసం చేయడంతో హీరోగా మారిన ‘విశ్వంభర’ డైరెక్టర్.. సినిమా రిలీజ్ అవ్వలేదు కానీ..
ఈ సాంగ్ లో ఇడియట్ లో చూపుల్తో గుచ్చి గుచ్చి సాంగ్ మ్యూజిక్ తో పాటు రవితేజతో అవే స్టెప్పులు వేయించారు. దీంతో ఈ పాట వైరల్ గా మారి రవితేజ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. మరోసారి ఈ పాటతో థియేటర్స్ లో మాస్ మహారాజ ఫ్యాన్స్ స్టెప్పులు అదరగొడతారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.