Vassishta : మోసం చేయడంతో హీరోగా మారిన ‘విశ్వంభర’ డైరెక్టర్.. సినిమా రిలీజ్ అవ్వలేదు కానీ..

వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Vassishta : మోసం చేయడంతో హీరోగా మారిన ‘విశ్వంభర’ డైరెక్టర్.. సినిమా రిలీజ్ అవ్వలేదు కానీ..

Do You Know Vishwambhara Director Vassishta act as Hero for a Movie Details Here

Updated On : April 14, 2025 / 3:37 PM IST

Vassishta : సినీ పరిశ్రమలో చాలా మంది ఒకటి అవుదామని ఇంకొకటి అయినవాళ్లు ఉన్నారు. డైరెక్టర్ అవుదామని హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. హీరోలు దర్శకులుగా మరీనా వాళ్ళు ఉన్నారు. అలాంటి లిస్ట్ లో విశ్వంభర డైరెక్టర్ కూడా ఒకరు. డైరెక్టర్ వశిష్ట మల్లిడి మొదటి సినిమా బింబిసార సినిమాతోనే పెద్ద హిట్ కొట్టి ఇప్పుడు చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నాడు.

వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే డైరెక్టర్ వశిష్ట 18 ఏళ్ళ క్రితమే సినీ పరిశ్రమలోకి వచ్చాడు. హీరోగా సినిమా కూడా చేసాడు.

Also Read : Sampath Nandi : రామ్ చరణ్ కి హిట్ ఇచ్చినా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో సినిమాలు ఆగిపోయి.. పాపం డైరెక్టర్..

వశిష్ట తండ్రి మల్లిడి సత్యనారాయణ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఉండేవారు. బన్నీ, ఢీ.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించింది ఆయనే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వశిష్ట తండ్రి మల్లిడి సత్యనారాయణ తన కొడుకు సినీ ప్రయాణం గురించి తెలిపాడు.

నిర్మాత మల్లిడి సత్యనారాయణ మాట్లాడుతూ.. వశిష్టని ఎవరో హీరోగా పెడతా అని చెప్పి మోసం చేసారు. వేరేవాళ్లను పెట్టి సినిమా తీశారు. దాంతో వశిష్ట వాళ్ళ మీద కోపంతో హీరో అవ్వాలి, నన్ను హీరోగా పెట్టి సినిమా చెయ్యి అని నన్ను అడిగాడు. అలా వశిష్ట హీరోగా పాటల రచయిత కులశేఖర్ దర్శకుడిగా ప్రేమలేఖ రాశా అనే సినిమా చేసాం. ఆ సినిమా సరిగ్గా రాలేదు. సినిమా అంతా అయిన తర్వాత చూస్తే ఇది రిలీజ్ చేస్తే ఫ్లాప్ అవుతుంది, పేరు కూడా పోతుంది, డబ్బులు రావు అని రిలీజ్ చేయలేదు. ఆ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం జెమిని టీవీకి ఇచ్చేశాం.

సినిమా రిలీజ్ అవ్వకపోవడంతో నెక్స్ట్ ఏంటి అని మా అబ్బాయిని అడిగాను. వాడికి కూడా హీరో మీద ఇంట్రెస్ట్ పోయింది. డైరెక్టర్ అవుతాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేరతాను అన్నాడు. దాంతో నిర్మాత బెల్లంకొండ సురేష్ నాకు క్లోజ్ కావడంతో బాలకృష్ణ లక్ష్మీనరసింహ సినిమాకు డైరెక్టర్ జయంత్ సి ఫరంజి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించాను. అక్కడి నుంచి జయంత్ దగ్గర, వినాయక్ దగ్గర, ఇంకొంతమంది దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసాడు.ఆ తర్వాత డైరెక్టర్ గా ప్రయత్నాలు మొదలుపెట్టాడు అని తెలిపారు. అలాగే వశిష్ట అసలు పేరు వెంకట నారాయణ రెడ్డి అని కూడా తెలిపారు.

Also Read : Jaat Movie : సినిమా సూపర్ హిట్.. కానీ తెలుగు డైరెక్టర్ ని బెదిరిస్తున్న తమిళ్ ప్రజలు..

వశిష్ట హీరోగా చేసిన ప్రేమలేఖ రాశా సినిమాలో అంజలి హీరోయిన్ గా నటించింది. ఒక కాలేజీ చదివే కుర్రాడు లవ్ లో పడటం, హీరోయిన్ పేరెంట్స్ ని ఎదురించడం అని అప్పటి రొటీన్ కథతో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.