Jaat Movie : సినిమా సూపర్ హిట్.. కానీ తెలుగు డైరెక్టర్ ని బెదిరిస్తున్న తమిళ్ ప్రజలు..

బాలీవుడ్ లో మాత్రమే రిలీజయిన జాట్ సినిమా అక్కడ మంచి విజయమే సాధిచింది.

Jaat Movie : సినిమా సూపర్ హిట్.. కానీ తెలుగు డైరెక్టర్ ని బెదిరిస్తున్న తమిళ్ ప్రజలు..

Some Tamil People Calls Boycott Sunny Deol Jaat Movie in Social Media and warn to Director Details Here

Updated On : April 14, 2025 / 1:49 PM IST

Jaat Movie : ఇటీవల చాలామంది మనోభావాలు దెబ్బ తింటున్నాయని అంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాని సినిమాగా చూడకుండా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక తప్పు వెతికి ఎవరో ఒకరు విమర్శలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా మూవీ యూనిట్ ని బెదిరిస్తున్నారు కూడా. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరగ్గా తాజగా మరోసారి రిపీట్ అయింది.

తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కిన సినిమా జాట్. ఇటీవల ఏప్రిల్ 10న జాట్ సినిమా రిలీజయింది. కేవలం హిందీలో బాలీవుడ్ లో మాత్రమే రిలీజయిన జాట్ సినిమా అక్కడ మంచి విజయమే సాధిచింది. జాట్ సినిమా ఇప్పటికే బాలీవుడ్ లో 50 కోట్ల కలెక్షన్స్ దాటి దూసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తమిళుల మనోభావాలు దెబ్బ తీశాయని, చరిత్రని వక్రీకరించి చూపించారని ఆరోపిస్తూ డైరెక్టర్ ని తీవ్రంగా విమర్శిస్తు బెదిరిస్తున్నారు కూడా.

Also See : Pawan Kalyan Wife : తిరుమలలో పవన్ భార్య.. మొక్కులు అర్పించి అన్నదానం చేసిన అన్నా కొణిదెల.. ఫొటోలు వైరల్

జాట్ సినిమాలో విలన్ శ్రీలంక నుంచి పారిపోయి వస్తాడు. అతను జాఫ్నా టైగర్‌ ఫోర్స్‌ పేరుతో పోలీసుల హిట్ లిస్ట్ లో ఉంటాడు. అయితే జాఫ్నా అనేది ఎక్కువమంది తమిళులు ఉన్న ప్లేస్. అక్కడే LTTE ని స్థాపించిన ప్రభాకరన్ జన్మించాడు. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం అతను పోరాడాడు. అయితే సినిమాలో చూపించిన జాఫ్నా టైగర్‌ ఫోర్స్‌, LTTE కి పోలికలు ఉన్నాయని, ప్రభాకరన్ తమిళుల కోసం పోరాడితే, సినిమాలో టెర్రరిస్ట్ లలాగా చూపించారని, తమిళులని కించపరిచారని, శ్రీలంకలో ఉండే తమిళుల మీద విద్వేషం చూపిస్తున్నారని కొంతమంది తమిళులు విమర్శిస్తున్నారు. సినిమాలో చూపించిన జాఫ్నా టైగర్స్ సంస్థ LTTE అని, వాళ్ళని నెగిటివ్ గా చూపించారని పలువురు తమిళులు భావిస్తున్నారు.

పలువురు తమిళ్ నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ని షేర్ చేసి తమిళులు జాట్ సినిమాని చూడొద్దు, జాట్ సినిమాని బాయ్ కాట్ చేయండి, డైరెక్టర్ తమిళనాడు వస్తే అతని పని చెప్తాము, తమిళుల కోసం పోరాడిన వాళ్ళని ఉగ్రవాదులుగా చూపించారు అంటూ విమర్శలు చేస్తూ ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని స్పందిస్తాడా లేదా చూడాలి.

Also Read : Pawan Kalyan Wife : తనయుడు కోలుకోవడంతో.. తిరుమలలో అన్నదానానికి పవన్ కళ్యాణ్ భార్య విరాళం.. ఎంతిచ్చారంటే..