Sampath Nandi : రామ్ చరణ్ కి హిట్ ఇచ్చినా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో సినిమాలు ఆగిపోయి.. పాపం డైరెక్టర్..

ఓ ఇంటర్వ్యూలో ఆగిపోయిన తన సినిమాల గురించి మాట్లాడాడు సంపత్ నంది.

Sampath Nandi : రామ్ చరణ్ కి హిట్ ఇచ్చినా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో సినిమాలు ఆగిపోయి.. పాపం డైరెక్టర్..

Director Sampath Nandi Talks About his Movies with Pawan Kalyan and Sai Durgha Tej

Updated On : April 14, 2025 / 2:16 PM IST

Sampath Nandi : మొదట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ సంపత్ నంది ఇప్పుడు మాత్రం ఫ్లాప్స్ రావడంతో డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చాడు. డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చినా రచయితగా, దర్శకత్వ పర్యవేక్షణ, నిర్మాణంలో భాగస్వామిగా మారి పలు సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో తమన్నా మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఓదెల 2 సినిమా ఏప్రిల్ 17 రిలీజ్ కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపత్ నంది వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆగిపోయిన తన సినిమాల గురించి మాట్లాడాడు సంపత్ నంది.

Also Read : Jaat Movie : సినిమా సూపర్ హిట్.. కానీ తెలుగు డైరెక్టర్ ని బెదిరిస్తున్న తమిళ్ ప్రజలు..

కొన్నాళ్ల క్రితం సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా గాంజా శంకర్ అనే సినిమాని ప్రకటించారు. సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. అయితే అదే సమయంలో డ్రగ్స్ వ్యవహారం వైరల్ అవ్వడంతో ఈ టైటిల్ పై విమర్శలు వచ్చాయి. మూవీ యూనిట్ కి నోటీసులు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో కానీ ఈ ప్రాజెక్టు మొత్తానికే ఆగిపోయింది.

దీని గురించి సంపత్ నంది స్పందిస్తూ.. ఈ సినిమాకు టైటిల్ తోనే సమస్య. గంజాయికి వ్యతిరేకంగానే ఆ కథ రాసుకున్నా. కానీ అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారు. టైటిల్ కచ్చితంగా మారుస్తాను. కథలో కూడా చిన్న చిన్న మార్పులు చేస్తాను. అది మోడ్రన్ స్క్రిప్ట్, ఆ కథని ఎప్పుడైనా సినిమాగా తీస్తాను అని తెలిపాడు.

Also See : Pawan Kalyan Wife : తిరుమలలో పవన్ భార్య.. మొక్కులు అర్పించి అన్నదానం చేసిన అన్నా కొణిదెల.. ఫొటోలు వైరల్

ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి స్పందిస్తూ.. పవన్ గారి కోసం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాను. ఏడాది పాటు ఆయనతో ట్రావెల్ చేశాను. కానీ సినిమా చేయలేకపోయాను. సినిమా ఎందుకు ఆగిపోయిందో ఇప్పటికి నా దగ్గర సమాధానం లేదు అని అన్నాడు. సంపత్ నంది మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కి రచ్చ సినిమాతో హిట్ ఇచ్చినా పవన్, సాయి ధరమ్ తేజ్ సినిమాలు ఆగిపోవడం గమనార్హం.