Jagapathi Babu : ఆరో తరగతిలో ఫస్ట్ క్రష్.. ఆమెకు 60 ఏళ్ళు వచ్చాక చెప్పిన జగపతి బాబు.. జగ్గూభాయ్ స్టోరీ భలే ఉందే..

జగపతి బాబు తన ఫస్ట్ క్రష్ అంటూ గతంలో జరిగిన ఓ విషయాన్ని తెలిపారు. (Jagapathi Babu)

  • Published on- May 8, 2026 / 08:47 PM IST

Jagapathi Babu

Jagapathi Babu : ఒకప్పటి హీరో జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో వదలా అనే డిఫరెంట్ సినిమాతో రాబోతున్నారు. ప్రస్తుతం జగపతి బాబు ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ క్రమంలో జగపతి బాబు తన ఫస్ట్ క్రష్ అంటూ గతంలో జరిగిన ఓ విషయాన్ని తెలిపారు.

Also See : Shanmukh Jaswanth : మరిన్ని నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసిన షణ్ముఖ్ జస్వంత్.. వైష్ణవితో షణ్ముఖ్ ఫోటోలు చూశారా..?

జగపతి బాబు మాట్లాడుతూ.. నేను చెన్నైలో ఆరో తరగతి చదివేటప్పుడు ఒక క్రష్ ఉండేది. మా తమిళ్ టీచర్ మీద నాకు క్రష్. ఒక ఆరేడేళ్లు నడిచింది అది. ఆమె డస్కీగా ఉండేది. కొప్పు పెట్టుకొని తలలో మందారపువ్వు పెట్టుకొని వచ్చేది రోజూ స్కూల్ కి. ఎందుకో ఆమె అంటే ఇష్టం ఉండేది కానీ చెప్పలేదు. అది ఎలాంటి ఇష్టమో తెలీదు.

నేను హీరో అయ్యాక, సక్సెస్ వచ్చాక నాకు ఒక 35 ఏళ్ళు వచ్చాక ఓ సారి ఆవిడని మళ్ళీ కలిసాను. అప్పుడు కార్ లో మంచి బిల్డప్ తో వెళ్ళాను. ఆవిడకు అప్పుడు 60 ఏళ్ళు ఉంటాయి అనుకుంట. చాలా సేపు మాట్లాడుకున్నాం. వెళ్ళేటప్పుడు నాకు మీ మీద క్రష్ ఉండేది అని చెప్పాను ఆవిడకు. అంతే ఆవిడ ఒక్క చూపు చూసింది ఆ చూపు జన్మలో మర్చిపోలేను అని అన్నారు.

Also See : Samantha : వామ్మో సమంత ఇలా మారిపోయిందేంటి.. మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫోటోషూట్.. ఫోటోలు వైరల్..