Jagapthi Babu : వందల కోట్ల ఆస్తి జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడు? సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంత సంపాదించాడు?

లెజెండ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించి అదరగొట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ కి లైన్ సెట్ చేసుకున్నాడు. అయితే జగపతి బాబు తండ్రి ఇచ్చిన ఆస్తి, అతను సంపాదించింది కొన్ని వందల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు.

Jagapthi Babu loss hundreds of Crores his property Japathi Babu second innings Earning Details

Jagapthi Babu : జగపతి బాబు ‘సింహ స్వప్నం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన తండ్రి రాజేంద్రప్రసాద్ స్టార్ నిర్మాత కావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఈజీగానే దొరికింది. కానీ హీరోగా నిలబడటానికి చాలా టైం పట్టింది. మొదట్లో మాస్ సినిమాలు, రకరకాల సినిమాలు చేసినా ఆ ఆతర్వాత పెద్దరికం, అల్లరి ప్రేమికుడు, ఆయనకిద్దరు, మావి చిగురు, పెళ్లి పందిరి, ప్రియరాగాలు, ఒక చిన్న మాట, మావిడాకులు, పెళ్లి కానుక, బడ్జెట్ పద్మనాభం, ఫ్యామిలీ సర్కస్.. ఇలా అనేక మంచి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరై ఫ్యామిలీ హీరో అనిపించుకున్నాడు. అమ్మాయిల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు జగపతి బాబు.

హీరోగా కెరీర్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టాడు జగపతి బాబు. లెజెండ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించి అదరగొట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ కి లైన్ సెట్ చేసుకున్నాడు. అయితే జగపతి బాబు తండ్రి ఇచ్చిన ఆస్తి, అతను సంపాదించింది కొన్ని వందల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఒకానొక సమయంలో అవకాశాలు లేక తన ఇల్లుని కూడా అమ్మడానికి సిద్ధపడ్డాడు. కానీ లెజెండ్ సినిమాతో దశ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నాడు.

గతంలో పలుమార్లు జగపతి బాబు స్వయంగా తన డబ్బు పోగొట్టుకున్నాను అని తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు దీనిపై స్పందిస్తూ.. నాకు క్యాసినో, గ్యాంబ్లింగ్ అలవాటు ఉంది. దాని వల్ల చాలానే డబ్బు పోగొట్టుకున్నాను. ఇక కొంతమంది నాకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా మోసం చేశారు. నా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. ఫ్యామిలీ కోసం ఎక్కువ అనవసరమైన ఖర్చులు పెట్టాను. ఇలా నా డబ్బు అంతా పోయింది. మొత్తం ఒకేదాంట్లో పోలేదు, నా అజాగ్రత్త వల్లే పోయింది అని తెలిపాడు.

JD Chakravarthy : దర్శకులకి వాళ్ళ కథలపై నమ్మకం లేనప్పుడే బూతులు, అడల్ట్ కంటెంట్ పెడతారు.. JD చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు..

ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. నాకు రెండు ఫోన్స్ ఉండేవి. ఆ ఫోన్స్ పట్టుకొని ఉండేవాడిని ఎప్పుడూ ఎవరన్నా కాల్ చేసి అవకాశాలు ఇస్తారేమో అని చూసేవాడిని. నాకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ వస్తే బాగుండు పోయిన డబ్బంతా సంపాదించాలి అనుకున్న. కనీసం ఒక 30 కోట్లు సంపాదిస్తే చాలు, నా ఫ్యామిలీ అంతా జీవితాంతం కూర్చొని అన్ని ఖర్చులతో బతికేస్తాం అనుకున్నాను. ఎలాగో లెజెండ్ సినిమా నా కెరీర్ ని మార్చేసి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది. ఆ తర్వాత నేను అనుకున్న 30 కోట్లు సంపాదించేసాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువే వస్తుంది. అది బోనస్. ప్రస్తుతానికి ఎలాంటి ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉన్నాను అని తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు