జైలర్ నటుడు అరెస్ట్..! ఎందుకంటే..

వినాయకన్ అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో అరెస్ట్ అయ్యాడు.

జైలర్ నటుడు అరెస్ట్..! ఎందుకంటే..

Jailer Actor Vinayakan Arrest (Photo Credit : Google)

Updated On : September 8, 2024 / 12:33 AM IST

Jailer Actor Arrest : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా నటుడు వినాయకన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో వినాయకన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ని వినాయకన్ కొట్టారు. మద్యం మత్తులో ఉన్న వినాయకన్.. కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. వినాయకన్ ని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ పోలీసులు ఆర్.జి.ఐ పోలీసులకు అప్పగించారు.

కొచ్చిన్ లో సినిమా షూట్ంగ్ ముగించుకుని గోవా కనెక్ట్ంగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వెయిటింగ్ లో ఉన్న సమయంలో కానిస్టేబుల్ పై వినాయకన్ దాడి చేశాడు. వినాయకన్ ను అదుపులోకి తీసుకున్న ఆర్జీఐ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. మద్యం మత్తులో తమపై దాడి చేశాడని వినాయకన్ పై ఫిర్యాదు చేశారు. వినాయకన్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో పాపులర్ అయ్యారు. కాగా, వినాయకన్ అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో అరెస్ట్ అయ్యాడు.

Also Read : పవన్ కళ్యాణ్ OG సినిమాలో.. పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్..