No Time To Die
No Time to Die: బాండ్ అని ఊరికే అంటారా..? అసలు ఆ సినిమాకుండే క్రేజ్.. రేంజ్ వేరే లెవల్ అంటున్నారు సినిమా కలెక్షన్లు చూసిన వారందరూ. అసలే రాకరాక వచ్చిన జేమ్స్ బాండ్ మూవీ. అందులోనూ డ్యానియల్ క్రెయిగ్ లాస్ట్ బాండ్ మూవీ.. హై ఓల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్. ఇంతకుమించిన స్పెషాలిటీస్ తో తెరకెక్కిన సినిమా వందల కోట్ల కలెక్షన్లతో మోత మోగించేస్తోంది.
God Father: పూరి ‘చిరు’ సాయం.. స్క్రిప్ట్‌లో మార్పులా?
జేమ్స్ బాండ్.. ఈ పేరు వింటేనే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఫ్యాన్స్ లో. అలాంటిది జేమ్స్ బాండ్ మూవీ రిలీజ్ అయితే ఆ సెలబ్రేషనే వేరు. ద మోస్ట్ అవెయిటింగ్ 25 జేమ్స్ బాండ్ మూవీ సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యింది. డ్యానియల్ క్రెయిగ్ లాస్ట్ టైమ్ బాండ్ గా 2 వేలకోట్లతో తెరకెక్కిన నో టైమ్ టు డై మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికే 800కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
Anchor Shyamala: మత్తెక్కించే అందాలతో మాయచేస్తున్న శ్యామల!
ప్రపంచ సినీ చరిత్రలోనే బాండ్ చిత్రాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన ఈ ఇంటర్నేషనల్ మూవీ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. చైనా, ఫ్రాన్స్ , రష్యాలో కాకుండా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన నో టైమ్ టు డై సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజే 600కోట్లు కలెక్ట్ చేసి జేమ్స్ బాండ్ స్టామినా ప్రూవ్ చేసింది.
Telugu Actors: మొన్న తేజ్.. ఇప్పుడు రామ్.. ఎందుకిలా జరుగుతోంది?
నో టైమ్ టు డై సినిమాకి ఫస్ట్ నుంచే విపరీతమైన క్రేజ్ ఉంది. దాంతో పాటు డ్యానియల్ బాండ్ గా కనిపించే లాస్ట్ మూవీ కావడంతో ఈసూపర్ స్టార్ ని బాండ్ గా చూడడానికి ఆడియన్స్ ఎగ్జైట్ అయిపోయారు. సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా త్రీడీలో రిలీజ్ అయిన జేమ్స్ బాండ్ నో టైమ్ టూ డై మూవీ ఇప్పటి వరకూ 100 మిలియన్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇది ఒక్క యూకేలో మాత్రమే కాగా ఈ నెల 8న అమెరికా.. నెల చివరలో చైనాలో విడుదల కానుంది. మరి అక్కడ కూడా విడుదలైతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కాసుల సునామీ సృష్టించడం గ్యారంటీగా కనిపిస్తుంది.