Jana nayagan movie pre-sales ticket money refunded.
Jana Nayagan: తమిళ స్టార్ విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్(Jana Nayagan)’. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజ హగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ బ్యూటీ మమిత బైజు కీ రోల్ ప్లే చేస్తోంది. తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ భగవత్ కేసరి సినిమాకు పొలిటికల్ టచ్ ఇస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.
ఇక విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం ఈ సినిమా జనవరి 9న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ, సెన్సార్ నిబంధనల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే, విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా టికెట్స్ ను ముందే భారీ ఎత్తున బుక్ చేసుకున్నారు.
దీంతో బుక్ మై షో భారీగా డబ్బులు రిఫండ్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. అయితే, ఈ రిఫండ్ అనేది సినిమా చరిత్రలోనే భారీ రిఫండ్ అవడం విశేషం. నిజానికి, విజయ్ జన నాయగన్ సినిమా కోసం ప్రీ సేల్స్ లో భాగంగా మూడు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడు అయ్యాయని సమాచారం. ఈ సేల్స్ తో దాదాపు రూ.19 కోట్లకు పైగా కలక్షన్స్ వచ్చాయని సమాచారం.
ఆ మొత్తాన్ని ప్రేక్షకులకు రిఫండ్ చేశారట. ఇంత మొత్తంలో మనీ రిఫండ్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక జన నాయగన్ సినిమా విడుదల కోసం విజయ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు జన నాయగన్ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.