Vijay Deverakonda: చిరు మూవీకి నో రివ్యూ, రేటింగ్.. సొంత మనుషులే ఇలా చేస్తున్నారు.. విజయ్ ఎమోషనల్ పోస్ట్

డియర్ కామ్రేడ్ సినిమా నుంచి నా సినెమాలపై ఇలాంటి ఫేక్ రివ్యూ, రేటింగ్ దాడి జరిగింది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).

Vijay Deverakonda: చిరు మూవీకి నో రివ్యూ, రేటింగ్.. సొంత మనుషులే ఇలా చేస్తున్నారు.. విజయ్ ఎమోషనల్ పోస్ట్

Vijay Deverakonda emotional post about film reviews and ratings.

Updated On : January 11, 2026 / 4:45 PM IST
  • రివ్యూ, రేటింగ్స్ పై విజయ్ ఎమోషనల్ పోస్ట్
  • డియర్ కామ్రేడ్ సినిమా నుంచి జరుగుతూనే ఉంది
  • ఇంతకాలానికి అందరికీ తెలిసింది

Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో ఆయన సినిమాలపై వస్తున్న ఫేక్ రివ్యూ అండ్ రెంటింగ్స్ గురించి ప్రస్తావించాడు. ఈ మేరకు చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు గారు సినిమా మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన ఈ పోస్ట్ లో ప్రస్తావించాడు. మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు బుక్ మై షో రివ్యూ అండ్ రేటింగ్స్ ఇవ్వకూడని కోర్ట్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఈ విషయం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ‘ఇది చూసి సంతోషంగానూ.. బాధగానూ ఉంది. చాలా మంది కష్టం, కలలు, డబ్బు రక్షించబడుతున్నాయని సంతోషంగా ఉంది. మనవాళ్లే ఈ సమస్యలను క్రియేట్ చేస్తున్నారు అని తెలిసి బాధగా ఉంది. బ్రతకనిచ్చి.. బ్రతకడం, అందరూ కలిసి ఎదగడం అనేవి అంశాలు ఏమయ్యాయి?
నా ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదలైన రోజుల నుంచి ఈ వ్యవస్థీకృత రాజకీయాలను చూసి షాక్ అయ్యాను.

Dulquer Salmaan: అదృష్టం అంటే దుల్కర్ దే.. మూడు భారీ ప్లాప్ ల నుంచి తప్పించుకున్నాడు!

ఇంతకాలం నా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. మంచి సినిమాను ఎవరూ ఆపలేరని చెప్పారు. కానీ, నాతో సినిమాలు చేసిన నిర్మాతలు, దర్శకులు ఈ సమస్య గురించి తెలుసుకున్నారు. నా కలలను, నా తర్వాత వచ్చే చాలా మంది కలలను రక్షించుకోవడానికి ఆలోచిస్తూ చాలా రాత్రులు మేల్కొనే ఉన్నాను. ఇంతకాలానికి ఈ విషయం బయటపడినందుకు సంతోషిస్తున్నాను.

మెగాస్టార్ లాంటి పెద్ద హీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు ఇప్పుడు గుర్తించింది. ఇది సమస్యను పూర్తిగా పరిష్కరించడం కాదు సమస్య తీవ్రతను తగ్గించడం. విషయాలలో ఒకటి తగ్గుతుంది. సంక్రాంతి సినిమాలు మనందరినీ అలరించి విజయం సాధించాలని ఆశిద్దాం’ రాసుకొచ్చాడు. దీంతో విజయ్ చేసిన ఈ పోస్ట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.