Dulquer Salmaan: అదృష్టం అంటే దుల్కర్ దే.. మూడు భారీ ప్లాప్ ల నుంచి తప్పించుకున్నాడు!

దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నమ్మకమే నిజం అయ్యింది. ఆయన నో చెప్పిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

Dulquer Salmaan: అదృష్టం అంటే దుల్కర్ దే.. మూడు భారీ ప్లాప్ ల నుంచి తప్పించుకున్నాడు!

Dulquer Salmaan first choice For Sivakarthikeyan role in Parasakthi movie.

Updated On : January 11, 2026 / 3:33 PM IST
  • దుల్కర్ సల్మాన్ మూవీ సెలక్షన్ సూపర్
  • మూడు డిజాస్టర్ సినిమాలకు నో చెప్పాడు
  • రీసెంట్ గా పరాశక్తి నుంచి కూడా

Dulquer Salmaan: ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే కష్టంతో పాటు లక్ కూడా అవసరమే. ఎందుకంటే, మంచి మంచి కథలు, మంచి సినిమాలు పడాలి కాబట్టి. కథలు సెలెక్ట్ చేసుకోవడం అనేది ముఖ్యంగా హీరోల డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడమే కాదు.. తమకు సూట్ కానీ, నచ్చని కథలకు నో కూడా చెప్పాలి. ఆ విషయంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) టాప్ లో ఉన్నాడు.

ఒక రకంగా చెప్పాలంటే దుల్కర్ అదృష్టవంతుడు అని చెప్పాలి. మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నందుకు కాదు, తనకు నచ్చని సినిమాలకు నో చెప్తున్నందుకు. అవును, ఆయన నో చెప్పిన మూడు పెద్ద సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. వాటిలో స్టార్ డైరెక్టర్స్ అయిన శంకర్, మణిరత్నం డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటితోపాటు రీసెంట్ గా విడువులైన ఒక సినిమాకు కూడా నో చెప్పాడు దుల్కర్. ఆ సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది.

Chiyaan Vikram: ఆరేళ్ళ షూటింగ్.. తొమ్మిదేళ్ల వెయిటింగ్.. విడుదలకు సిద్దమైన విక్రమ్ మూవీ

ఆ సినిమాలు మరేవో కాదు దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్, శంకర్ డైరెక్ట్ చేసిన ఇండియన్ 2, రీసెంట్ గా సుధ కొంగర చేసిన పరాశక్తి సినిమాలు ఉన్నాయి. థగ్ లైఫ్ సినిమాలో తమిళ స్టార్ శింబు చేసిన పాత్ర కోసం ముందు దుల్కర్ నే అనుకున్నారట. కానీ, కథ నచ్చకపోవడంతో నో చెప్పడటం దుల్కర్. విడుదల తరువాత ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఇక శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 సినిమాలో సిద్దార్థ్ చేసిన పాత్ర కోసం కూడా మొదట దుల్కర్ ను అనుకున్నారట.

కానీ, సినిమాలో ఆ పాత్ర నచ్చకపోవడంతో నో చెప్పాడట దుల్కర్. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. రీసెంట్ గా విడుదలైన పరాశక్తి సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ముందుగా ఈ కథను దుల్కర్ కి చెప్పిందట దర్శకురాలు సుధ కొంగర. కానీ, కథ తనకు సెట్ అవధాని వద్దని చెప్పేశాడట దుల్కర్. ఆ పాత్రలో శివ కార్తికేయన్ చేశాడు. ఇటీవల జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి నెగిటీవ్ కామెంట్స్ వస్తున్నాయి. ప్లాప్ దిశగా సాగుతోంది ఈ సినిమా కూడా. ఇలా మూడు ప్లాప్స్ నుంచి తెలివిగా తప్పించుకున్నాడు దుల్కర్. దీనిని, అదృష్టం కాక ఇంకేమనాలి.