Janasena chief pawan kalyan gave important post to Jani Master
Jani Master : టాలీవుడ్ డాన్స్ మాస్టర్ ‘జానీ’.. తన స్టెప్పుల కోరియోగ్రఫీతో ఆడియన్స్ ని ఉర్రుతలూగిస్తుంటారు. సౌత్ టు నార్త్ స్టార్ హీరోలందరికీ డాన్స్ కోరియోగ్రఫీ చేయించిన జానీ మాస్టర్.. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో కూడా స్టెప్పులు వేయించారు. ప్రస్తుతం డాన్స్ మాస్టర్ గా కెరీర్ లో పీక్ స్టేజ్‌లో ఉన్న జానీ మాస్టర్.. ఇప్పుడు రాజకీయాలు వైపు టర్న్ తీసుకుంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన జానీ మాస్టర్.. పొలిటికల్ పరంగా కూడా ఆయనతోనే అడుగులు వేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. గత కొంత కాలంగా తన నియోజకవర్గం అయిన నెల్లూరులో జనసేన తరుపు ప్రచారాలు చేస్తూ వచ్చిన జానీ.. ఇటీవలే పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యారు. ఇక తాజాగా పార్టీలో ఓ కీలక పదవిని అప్పగించారు. ఈ విషయాన్ని జానీ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.
Also read : Nagma : నగ్మా ఏంటి ఇంతలా మారిపోయింది…?
జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్ ని నియమించారు. ఇక ఈ కీలక పదవిని తనకి అప్పగించినందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కి, ప్రధాన కార్యదర్శి నాగబాబుకి.. జానీ మాస్టర్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక తనకి ఇచ్చిన ఈ భాద్యతలను.. జనసేన అఖండ విజయమే లక్ష్యంగా, ఆంధ్ర ప్రజల సంపూర్ణ అభివృద్దే గమ్యంగా భావించి నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు.