Nagma : నగ్మా ఏంటి ఇంతలా మారిపోయింది…?

90 లలో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన నటి నగ్మా. ఆమె దగ్గర కాల్ షీట్స్ కోసం దర్శకులు క్యూ కట్టేవారు. ప్రస్తుతం నగ్మా గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు?

Nagma : నగ్మా ఏంటి ఇంతలా మారిపోయింది…?

Nagma

Updated On : February 18, 2024 / 7:53 PM IST

Nagma : హిందీ సినిమా ‘బాగీ’తో వెండితెరపై అరంగేట్రం చేసిన నగ్మా తెలుగులో టాప్ హీరోలతో నటించారు. 90 లలో వరుసపెట్టి సినిమాలు చేసిన నగ్మా 2008 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం నగ్మా చాలా మారిపోయారు. రీసెంట్‌గా నగ్మా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసినవారంతా షాకవుతున్నారు.

Nagma 2

Nagma 2

Vijay Deverakonda : విజయ్ కామెంట్ చేస్తేనే పరీక్షలకు ప్రిపేర్ అవుతాం.. విద్యార్ధినిల వీడియోపై విజయ్ ఏమన్నాడంటే?

నగ్మా తెలుగులో చాలానే సినిమాలు చేసారు. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవితో ఘరానా అల్లుడు, నాగార్జునతో అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్‌లో మోహన్ బాబుకి జోడీగా నటించారు. ప్రభుదేవాతో తమిళంలో నటించిన ‘కాదలన్’ తెలుగులో ‘ప్రేమికుడు’గా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. తెలుగు, తమిళ సినిమాలతో పాటు భోజ్‌పురిలో కూడా అనేక సినిమాల్లో నటించారు నగ్మా. ఇక రాజకీయాలపట్ల ఆసక్తితో కాంగ్రెస్‌లో చేరి 2014 లో ఓటమిని చవి చూసారు. 2015 లో ‘ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్’ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. ప్రస్తుతం నగ్మా ఇటు సినిమాలు.. అటు రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా కనిపించట్లేదు.

Viva Harsha : బాడీ షేమింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా.. సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ ఎమోషనలైన వైవా హర్ష

కాగా ఇటీవల నగ్మాకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయారు నగ్మా. ఒకప్పుడు సినిమాల్లో కనిపించినా నగ్మా యేనా? పోల్చుకోలేకపోతున్నామంటూ.. నెటిజన్లు ఆశ్చర్యపోయారు. నగ్మా సినిమాలకు దూరంగా ఉండి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతోంది. బాగా బొద్దుగా కనిపిస్తున్న నగ్మా వయసు 48 సంవత్సరాలు. జ్యోతిక, రోషిణీ నగ్మాకు చెల్లెళ్లు. ప్రస్తుతం నగ్మా ముంబయిలో ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)