Viva Harsha : బాడీ షేమింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా.. సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ ఎమోషనలైన వైవా హర్ష

వైవా హర్ష ఫిబ్రవరి 23న 'సుందరం మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందరకి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న హర్ష మీడియాతో కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Viva Harsha : బాడీ షేమింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా.. సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ ఎమోషనలైన వైవా హర్ష

Viva Harsha

Viva Harsha : కమెడియన్ వైవా హర్ష మెయిన్ లీడ్‌లో వస్తున్న సినిమా ‘సుందరం మాస్టర్’. ఫిబ్రవరి 23న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న హర్ష తన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. హర్ష వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Vijay Deverakonda : విజయ్ కామెంట్ చేస్తేనే పరీక్షలకు ప్రిపేర్ అవుతాం.. విద్యార్ధినిల వీడియోపై విజయ్ ఏమన్నాడంటే?

సుందరం మాస్టర్ సినిమాని మాస్ మహారాజా రవితేజ RT టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. కళ్యాణ్ సంతోష్ డైరెక్ట్ చేసారు.  వైవా హర్ష లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా పోస్టర్, టీజర్‌తో పాటు రీసెంట్‌గా మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలో ఆసక్తి రేపింది. ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న వైవా హర్ష మూవీ ముచ్చట్లతో పాటు తన వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేసుకున్నారు.

వైవా హర్ష చిన్నతనం నుండి బాడీ షేమింగ్ ఎదుర్కున్నారట. అసలు తను లావుగా అవ్వడానికి కారణం కూడా చెప్పారు హర్ష. 10 నెలల వయసులో హర్ష సివియర్ ఆస్తమా అటాక్స్‌తో ఇబ్బంది పడేవారట. ఆ టైమ్‌లో డాక్టర్ 5 సంవత్సరాల పిల్లలకు ఇవ్వాల్సిన డోస్‌లో తనకు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చారట. తను పెరిగే క్రమంలో వాటి ప్రభావం శరీరంపై  చూపించి బాగా లావయ్యానని హర్ష చెప్పారు. ఎవరైనా తనని లావుగా ఉన్నాడని వెక్కిరిస్తున్నప్పుడు తన పేరెంట్స్ పడే బాధని చూసి ఇబ్బంది అనిపించేదని..ఎవరైనా ఇంటికి వచ్చిన సందర్భాల్లో ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించేవాడినని అన్నారు. ఇంటర్ నుండి ఈ విషయంలో పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెట్టానని.. ఇంజనీరింగ్‌కి వచ్చేసరికి ఫుల్ యాక్టివ్ అయ్యానని హర్ష చెప్పుకొచ్చారు. తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలుసునని ఆ దిశలో వెళ్తున్నానని తన గురించి  సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ అసలు పట్టించుకోనని హర్ష అన్నారు.

Pindam : అమెజాన్, అహలో అదిరిపోయే వ్యూస్ సంపాదిస్తున్న ‘పిండం’ మూవీ..

వైవా హర్ష, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మధ్య మంచి స్నేహం ఉంది. తన ఎంగేజ్మెంట్ వేడుక ఒక అన్నలా నిలబడి జరిపించాడని హర్ష చెప్పారు. ముఖ్యంగా తన మామగారితో ‘మీ అమ్మాయి మా ఇంటికి వస్తుంది.. మేం చూసుకుంటాం’ అని సాయి ధరమ్ ఆయనకు ధైర్యం చెప్పాడని అంటూ  వైవా హర్ష ఎమోషనల్ అయ్యారు. తన మంచితనం వల్లే చాలామంది సాయి ధరమ్ తేజ్‌ని ఇష్టపడతారని చెప్పారు. వైవా హర్ష వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.