×
Ad

Janasena : టాలీవుడ్ నిర్మాతకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన జనసేనాని.. ఆ సినిమా క్యాన్సిల్..?

తాజాగా పవన్ కళ్యాణ్ నిర్మాత రామ్ తాళ్లూరికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ప్రకటించారు.(Janasena)

Janasena

Janasena : నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరిని ప్రకటించారు. ఖమ్మంకు చెందిన రామ్ తాళ్లూరికి పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీ ఉన్నాయి. నిర్మాతగా SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నేల టికెట్, చుట్టాలబ్బాయి, మెకానిక్ రాకీ.. లాంటి పలు సినిమాలని నిర్మించారు.(Janasena)

గతంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఇటీవల వరకు ఆ సినిమా ఉంటుందనే నిర్మాత చెప్పుకొచ్చారు కానీ OG తర్వాత ఆ సినిమా చేసే పరిస్థితి కనపడట్లేదు. రామ్ తాళ్లూరి పవన్ కళ్యాణ్ కి 2014 నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. ఖమ్మంలో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేసారు. తెలంగాణలో పార్టీ పరంగా యాక్టివ్ గానే ఉన్నారు.

Also See : Pawan Kalyan : జానీ గన్‌ తో పవర్ స్టార్ స్టైలిష్ పోజులు.. బ్లాక్ డ్రెస్ లో కళ్యాణ్ బాబు కల్ట్ లుక్స్.. ఆ స్వాగ్ చూడు తమ్ముడు..

Janasena

తాజాగా పవన్ కళ్యాణ్ నిర్మాత రామ్ తాళ్లూరికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది.

ఈ ప్రకటనలో.. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీ రామ్ తాళ్ళూరిని నియమిస్తున్నాను. పార్టీ సంస్థాగత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను ప్రదాన కార్యదర్శి హోదాలో నిర్వర్తిస్తారు. పార్టీ కోసం పని చేస్తానని 2014లోనే ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఎటువంటి ఆపేక్ష లేకుండా పార్టీ పట్ల ఎంతో అంకిత భావాన్ని కనబరుస్తూ, అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. పార్టీ తెలంగాణ విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సాప్ట్ వేర్ నిపుణుడైన ఆయన సాఫ్ట్ వేర్ సంస్థల యజమానిగా ఉన్నారు. శ్రీ రామ్ తాళ్ళూరికి ఉన్న సంస్థాగత నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడమైనది అని తెలిపారు పవన్ కళ్యాణ్.

Also Read : Pawan kalyan : మొదటిసారి ఫ్యాన్ వార్స్ పై స్పందించిన పవన్ కళ్యాణ్.. అందరి అభిమానులకు నా రిక్వెస్ట్ అంటూ..

దీనిపై రామ్ తాళ్లూరి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ సర్ కి ధన్యవాదాలు. నా ప్రతి మూమెంట్ పార్టీ కోసమే అంకితం. మీ విలువలను ఫాలో అవుతూ మీ అడుగుజాడల్లో నడుస్తూ మీ విజన్ ని సాకారం చేస్తాను. ఒక విజనరీ లీడర్ కేవలం మాటలతో ఇన్ స్పైర్ చేయరు పని చేసి చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సర్ లాగా. ఇది ఆల్మోస్ట్ 9 ఏళ్ళ జర్నీ. నాకు ఇప్పటికి మిమ్మల్ని కలిసిన మొదటి రోజు గుర్తుంది. మీరు ఇప్పటికి అదే అంకితభావం, ఎనర్జీతో ఉన్నారు. నాగబాబు గారు, నాదెండ్ల మనోహర్ గారితో కలిసి పార్టీ అభివుద్ధికి పనిచేస్తాను అని తెలిపారు.