Janhvi Kapoor : రిహన్నతో జాన్వీ కపూర్ డ్యాన్స్ మాములుగా లేదుగా.. వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియాలో రిహన్న ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా రిహన్నతో పాటు జాన్వీ కపూర్ కూడా వైరల్ అవుతుంది.

Janhvi Kapoor and Rihanna Dance in Anant Ambani Radhika Pre Wedding Celebrations Video goes Viral

Janhvi Kapoor : వరల్డ్ పాపులర్ పాప్ సింగర్ రిహన్న(Rihanna) ఇండియాకి వచ్చిన సంగతి తెలిసిందే. ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో రిహన్న స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చింది. దీంతో నిన్నటి నుంచి ఇండియా అంతా రిహన్న వైరల్ అవుతుంది. నిన్న నైట్ అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రిహన్న ఇచ్చిన పర్ఫార్మెన్స్ వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో రిహన్న ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా రిహన్నతో పాటు జాన్వీ కపూర్ కూడా వైరల్ అవుతుంది. జాన్వీ కూడా నిన్న అనంత్ రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొంది. రిహన్న పర్ఫార్మెన్స్ అయినా తర్వాత పార్టీలో ఎంజాయ్ చేసేటప్పుడు జాన్వీ రిహన్నను కలిసింది. వీరిద్దరూ కలిసి పార్టీని ఎంజాయ్ చేశారు. రిహన్నతో కలిసి పార్టీలో స్టెప్పులేసింది జాన్వీ కపూర్.

Also Read : Sreeleela : శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోలు.. గోదాదేవిగా శ్రీలీల..

జాన్వీ కపూర్, రిహన్నతో స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ స్టెప్పులేంట్రా బాబు, జాన్వీ రిహన్నకి ఇంత పెద్ద ఫ్యానా, పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేసారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అంబానీ ఇంట పెళ్లి వేడుకలతో జాన్వీ కపూర్ వైరల్ గా మారింది.