Janhvi Kapoor and Varun Dhawan Movie Bawaal Trailer Released
Bawaal Trailer : బాలీవుడ్(Bollywood) భామ జాన్వి కపూర్(Janhvi Kapoor) ఇప్పటివరకు అన్ని ప్రయోగాత్మక సినిమాలే చేసింది. మొదటిసారి కాస్త కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. కానీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కానుండటం గమనార్హం. వరుణ్ ధావన్(Varun Dhawan), జాన్వీ కపూర్ జంటగా నితేశ్ తివారి దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలా నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బవాల్’. ఈ సినిమా జులై 21 నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
తాజాగా ‘బవాల్’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. దుబాయ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో ఈ ట్రైలర్ లాంచ్ ని చేశారు. ట్రైలర్ లో..హీరో ఓ హిస్టరీ టీచర్ అని చూపించారు. హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమ, పెళ్లి అనంతరం హనీమూన్ కోసం పారిస్ కు వెళ్తారు. అక్కడ హీరోకు రెండో ప్రపంచయుద్ధం సన్నివేశాలు గుర్తుకురావడం, వరుణ్ – జాన్వీ మధ్యలో గొడవలు అవ్వడం చూపించారు. దీంతో ట్రైలర్ చూస్తుంటే ఓ మాములు లవ్ స్టోరీకి రెండో ప్రపంచయుద్ధానికి ఏదో లింక్ పెట్టినట్టు తెలుస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
జాన్వీ ఇప్పటివరకు కమర్షియల్ గా ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఈ సినిమాతోనైనా కమర్షియల్ హిట్ కొడుతుంది అనుకుంటే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తుంది. ఇది వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది. ఇదే జాన్వికి మొదటి కమర్షియల్ హిట్ అవుతుందని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు.