Janhvi Kapoor : స్టేజి పై పెర్ఫామెన్స్.. డ్రెస్ జిప్ చిరిగిపోయింది.. ఫోటోలను షేర్ చేసిన జాన్వీ!

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కి హాజరయ్యిన జాన్వీ కపూర్ డ్రెస్ జిప్ చిరిగిపోయింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor dress zip rips at 68th Filmfare Awards

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది తక్కువ సినిమాలే అయినా, సక్సెస్ రేట్ తక్కువే ఉన్నా.. క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్ లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. నార్త్ లోనే కాదు ఒక సినిమా కూడా చేయని సౌత్ లో కూడా మంచి క్రేజ్ ని దక్కించుకుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. స్టేజి పై పెర్ఫామెన్స్ ఇస్తుండగా తన గౌను జిప్ చిరిగిపోయింది అంటూ ఫోటో షేర్ చేసింది.

NTR – Allu Arjun : పుష్ప 2 సెట్స్ లో ఎన్టీఆర్.. పిక్ వైరల్!

నిన్న (ఏప్రిల్ 27) రాత్రి ముంబైలో బాలీవుడ్ 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ (Filmfare Awards) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ అవార్డ్స్ లో ‘మిలి’ సినిమాతో జాన్వీ కపూర్ కూడా నామినేషన్స్ లో నిలవడంతో వేడుకకు హాజరయ్యింది. ఈ కార్యక్రమానికి బ్లూ డ్రెస్ లో అందర్నీ మెస్మరైజ్ చేసింది. అయితే ఆ డ్రెస్ మాత్రం తనని చాలా ఇబ్బంది పెట్టింది అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. ఆ డ్రెస్ తో రెడ్ కార్పెట్ పై నడిచే 5 నిమిషాల ముందు జిప్ చిరిగిపోయిందని, ఆ తరువాత స్టేజి పై పెర్ఫామెన్స్ ఇచ్చే 12 నిమిషాల ముందు జిప్ మళ్ళీ చిరిగినట్లు జాన్వీ తెలియజేసింది.

FilmFare Awards : ఫిలింఫేర్ అవార్డ్స్ 2023 (బాలీవుడ్).. ఫుల్ అవార్డుల లిస్ట్..

ఈ విషయాన్ని చెప్పుకొస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలో జాన్వి కారులో కూర్చొని ఉంటే టైలర్ వెనుక నుంచి ఆ జిప్ ని కుడుతూ ఉండడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా జాన్వీ టాలీవుడ్ కి NTR30 సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాతో సౌత్ లో తన తల్లి శ్రీదేవిలా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలని చూస్తుంది. మరి ఈ అమ్మడి ఆశలు ఫలిస్తాయా? లేదా? చూడాలి.