Site icon 10TV Telugu

Janhvi Kapoor : ఆ సినిమా కూడా ఓటీటీలోనే.. ఇక జాన్వీ కమర్షియల్ ఎంట్రీ టాలీవుడ్ తోనే..

Janhvi Kapoor new movie Bawaal also releasing in OTT

Janhvi Kapoor new movie Bawaal also releasing in OTT

Janhvi Kapoor  :  గ్లామర్ హీరోయిన్ గా, స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టెయ్యాల్సిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇప్పటి వరకూ కమర్షియల్ సినిమా చెయ్యనే లేదు. వరసగా తన సినిమాలన్నీ ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. థియేటర్లో రిలీజయిన సినిమాలు కమర్షియాలు సినిమాలు కావు. అవి అంతగా మెప్పించనూ లేదు. జాన్వీకపూర్ స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకూ అప్ టూద మార్క్ సినిమాలు చెయ్యనే లేదు. ఏదో ఒకటీ అరా సినిమాలు చేసినా అవి స్టార్ హీరోయిన్ అనిపించుకునేంత రేంజ్ లో ఉన్నవి కాదు.

జాన్వీ కమర్షియల్ ఫార్మాట్ లో ఇప్పటిదాకా సినిమా చెయ్యనే లేదు. ఇన్నాళ్లకి బవాల్ తో కమర్షియల్ మూవీ దొరికినా, ఆఖరికి అది కూడా ఓటీటీలోనే రిలీజవుతోంది. దీంతో జాన్వీ ధియేటర్ కమర్షియల్ మూవీ ఎంట్రీకి చాన్స్ లేకుండా పోయింది. ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ ఓటీటీలోనే ఎక్కువగా రిలీజ్ అవ్వడంతో అసలు జాన్వీ యాక్టింగ్ టాలెంట్ ని బిగ్ స్క్రీన్ మీద చూసే చాన్స్ పెద్దగా దొరకలేదు ఆడియన్స్ కి. కెరీర్ స్టార్ట్ చేసి 5 ఏళ్లకు పైనే అయినా స్టార్ కిడ్ అయ్యిండి ఒక్క సినిమా కూడా ధియేటర్లో పెద్ద హిట్ కాలేదు. ఇప్పటి వరకూ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న జాన్వీ ఫస్ట్ టైమ్ వరుణ్ ధావన్ తో బవాల్ తో కమర్షియల్ మూవీ చేస్తోంది. ఈ సినిమాని గ్రాండ్ గా ధియటేర్లో రిలీజ్ చేద్దామనుకుంటే ఓటీటీ ఇచ్చిన ఆఫర్ కి టెంప్ట్ అయ్యి మేకర్స్ ఓటీటీలోనే రిలీజ్ కి రెడీ అయ్యారు.

జాన్వీ తన సొంత ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ లో ఎలా అయినా కమర్షయిల్ సినిమా చేసి హిట్ కొడదామనుకున్న ఆశ ఇప్పుడప్పుడే తీరేలా లేదు. ఇప్పటి వరకూ చేసిన గుడ్ లక్ జెర్రీ, గుంజన్ సక్సేనా, మిలి, రూహి ఇలా డిఫరెంట్ జానర్ లో చేసిన వాటిలో కొన్ని ధియేటర్లో రిలీజ్ అయినా కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు. ఇక బాలీవుడ్ లో కమర్షియల్ సినిమా జాన్వీకి వర్కౌట్ అయ్యేలా లేదు. జాన్వీ థియేటర్లో రిలీజయ్యే మొదటి కమర్షియల్ సినిమా ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ‘దేవర’నే అవుతుంది.

Hanuman : సంక్రాంతికి వస్తున్న హనుమాన్.. స్టార్ హీరోల మధ్య తేజ సజ్జ పాన్ ఇండియా పోటీ..

ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దేవర’లో ఎన్టీఆర్ కు జంటగా నటిస్తూ ఫస్ట్ కమర్షియల్ ధియేటర్ రిలీజ్ కు రెడీ అవుతోంది జాన్వీ కపూర్. దీంతో టాలీవుడ్ ఎంట్రీ తోనే భారీ హిట్ కొడుతుంది జాన్వీ అని భావిస్తున్నారు అంతా.

Exit mobile version