Janhvi Kapoor: హీరోయిన్ జాన్వీకి ఖరీదైన గిఫ్ట్.. ఎన్ని కోట్ల రూపాయలో, ఎవరిచ్చారో తెలుసా?

జాన్వీ ప్రస్తుతం రామ్‌ చరణ్‌ "పెద్ది" సినిమాలో నటిస్తోంది.

హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ తాజాగా రూ.5 కోట్ల విలువజేసే లంబోర్గినిని గిఫ్ట్‌గా అందుకుంది. ఆమెకు ఆ గిఫ్ట్‌ను ఆమెకు ఇచ్చింది ఎవరో కాదు సింగర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌ అనన్య బిర్లా.

జాన్వీ అందుకున్న ఈ కారుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. లంబోర్గినిని ఓ వ్యక్తి జాన్వీ ఇంటికి వరకు డ్రైవ్‌ చేస్తూ తీసుకెళ్తుండగా ఈ వీడియో తీశారు. లంబోర్గినిలో ఓ గిఫ్ట్‌ బాక్స్‌ను కూడా పంపింది అనన్య బిర్లా.

వ్యాపారవేత్త కుమార్‌ మంగళం, నీరజ బిర్లా కుమార్తె అనన్య బిర్లా. ఇటీవల అనన్య బిర్లా ఒ మేకప్‌ బ్రాండ్‌ను కూడా ప్రారంభించింది. ఈ కొత్త కంపెనీకి జాన్వీ కపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే థ్యాంక్స్ చెబుతూ జాన్వీకి ఈ ఖరీదైన కారును పంపించినట్లు తెలుస్తోంది.

జాన్వీ ప్రస్తుతం రామ్‌ చరణ్‌ “పెద్ది” సినిమాలో నటిస్తోంది. అలాగే, మరిన్ని బాలీవుడ్‌ సినిమాల్లోనూ ఆమె యాక్ట్ చేస్తోంది. మొదట బాలీవుడ్‌ సినిమాలకే ఈ ముద్దుగుమ్మ పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు.

ఆమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టింది. దేవర సినిమాలో ఆమె ఎన్టీఆర్ సరసన నటించింది. టాలీవుడ్‌ సినిమాలపై ఆసక్తి చూపుతోంది. ఆమె ఫిట్‌నెస్, ఫ్యాషన్ వీడియోను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.