Jani Master : అర్ధరాత్రి హైవేపై యాక్సిడెంట్.. కాపాడిన జానీ మాస్టర్.. దయచేసి అంటూ ఎమోషనల్ పోస్ట్.. వీడియో వైరల్..

తాజాగా జానీ మాస్టర్ తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసారు.

Jani Master shares an Midnight Highway Accident Video it goes Viral

Jani Master : జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇటీవలే బెయిల్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చాక జానీ మాస్టర్ మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. తాజాగా జానీ మాస్టర్ తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో హైవేపై ఎవరికో యాక్సిడెంట్ అయితే జానీ మాస్టర్ దగ్గరుండి వాళ్ళను చూసుకుంటున్నట్టు, హాస్పిటల్ కు తరలిస్తున్నట్టు ఉంది.

Also Read : Suriya – Sundeep Kishan : ఒకప్పుడు సూర్య సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు సూర్య పక్కన గెస్ట్ గా కూర్చొని.. సందీప్ కిషన్ ఎమోషనల్..

జానీ మాస్టర్ ఈ వీడియో షేర్ చేసి.. మేము నెల్లూరు హైవేలో వెళుతుండగా పిడుగురాళ్ల దగ్గర జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతనికి వెంటనే మెడికల్ సపోర్టు ఇప్పించి ఆసుపత్రికి తరలించాము. దయచేసి రోడ్లపై రాత్రి పూట డ్రైవింగ్ చేసేటపుడు త్వరగా ఇంటికెళ్ళాలని మీ తలలో ఎన్ని ఆలోచనలున్నా సరే వేగంగా వెళ్ళకండి, హెల్మెట్ ధరించడం మర్చిపోకండి అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

 

గతంలో కూడా జానీ మాస్టర్ ఎన్నో సార్లు అనేక సహాయాలు చేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ తరపున కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ జరగ్గానే స్పందించడంతో మరోసారి ఫ్యాన్స్, నెటిజన్లు జానీ మాస్టర్ ని అభినందిస్తున్నారు.