japan couple re creates Mahesh Babu Sreeleela Kurchi Madathapetti song steps
Kurchi Madathapetti song : టాలీవుడ్ లో మరో సాంగ్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకుంటుంది. తెలుగు పాటలు ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాల సాంగ్స్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకుంటూ వచ్చాయి. ఇప్పుడు మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ తెలుగు ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన విధంగానే ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది.
ఇటీవల కొందరు ఫారినర్స్ తమ జిమ్ వర్క్ అవుట్స్ కోసం ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ని ఉపయోగించుకుంటూ కసరత్తులు చేస్తున్న వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో పై మహేష్ బాబు కూడా రియాక్ట్ అవుతూ స్టోరీ పెట్టడం విశేషం. ఇక తాజాగా ఒక జపాన్ జంట.. ఈ పాటకి మహేష్ బాబు, శ్రీలీల వేసిన స్టెప్స్ ని రీ క్రియేట్ చేస్తూ చేసిన రీల్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Trisha : మళ్ళీ పాత జోడిలతో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్న త్రిష.. మొన్న చిరు, ఇప్పుడు వెంకీ..
తెలుగు మాస్ సాంగ్ కి జపాన్ జంట వేసిన స్టెప్పులు విజుల్స్ వేయిస్తున్నాయి. ఈ వీడియో చూసిన టాలీవుడ్ ఆడియన్స్.. ‘జపాన్ జంట స్టెప్పులతో ఇచ్చిపడేశారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తన గ్రేస్ తో అమ్మాయి బాగా డాన్స్ వేసిందంటూ పేర్కొంటున్నారు. మరి ఆ జపాన్ జంట వేసిన ఆ సాంగ్ ని మీరు కూడా చూసేయండి.
కాగా ఇటీవల మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు ‘భారతి’ కూడా ఈ పాటకి అదిరిపోయే మాస్ స్టెప్పులు వేస్తూ ఓ రీల్ చేసింది. బాబాయ్ పాటకి భారతి గ్రేస్‌తో ఊరమస్ గా స్టెప్పులు వేసి ఆడియన్స్ నుంచి విజుల్స్ ని అందుకున్నారు. ఆ వీడియోని కూడా చూసేయండి.