Trisha : మళ్ళీ పాత జోడిలతో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్న త్రిష.. మొన్న చిరు, ఇప్పుడు వెంకీ..

ఓల్డ్ కాంబినేషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్న త్రిష. కమల్ హాసన్, అజిత్, చిరంజీవి, వెంకటేష్..

Trisha : మళ్ళీ పాత జోడిలతో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్న త్రిష.. మొన్న చిరు, ఇప్పుడు వెంకీ..

South star heroine Trisha bring new movies with old combinations

Updated On : February 23, 2024 / 8:34 AM IST

Trisha : హీరోయిన్ త్రిష సౌత్‌లో ఇంకా తన స్టార్ స్టేటస్ ని అలాగే కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది పొన్నియిన్ సెల్వన్, లియో సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్స్ అందుకున్న త్రిష.. ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రెజెంట్ తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రెండు రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.

మలయాళంలో మోహన్ లాల్‌ చిత్రంతో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక తమిళంలో అజిత్ అండ్ కమల్ హాసన్ సినిమాలకు సైన్ చేసారు. ఈ ఇద్దరి హీరోలతో త్రిష గతంలో కలిసి నటించారు. చాలా గ్యాప్ తరువాత మళ్ళీ ఇప్పుడు అజిత్ అండ్ కమల్ తో జత కడుతున్నారు. కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా పాత కాంబినేషన్స్ తోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Also read : Sundaram Master Review : సుందరం మాస్టర్ రివ్యూ.. వైవా హర్ష హీరోగా మొదటి సినిమా మెప్పించాడా?

ఈక్రమంలోనే ఆల్రెడీ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకి సైన్ చేసారు. ఇటీవలే చిరుతో పాటు షూటింగ్ సెట్స్ లోకి కూడా అడుగుపెట్టారు. చిరంజీవి, త్రిష గతంలో ‘స్టాలిన్’ సినిమాలో కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు విశ్వంభర సినిమాతో స్క్రీన్ పై కలిసి కనిపించబోతున్నారు. చిరంజీవితో పాటు వెంకటేష్‌తో కూడా త్రిష రీ యూనియన్ అవుతున్నారు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న వెంకటేష్ అండ్ త్రిష.. ఆ తరువాత నమో వెంకటేష్, బాడీగార్డ్ తో అలరించారు.

మళ్ళీ ఇప్పుడు నాలుగోసారి కలిసి నటించేందుకు సిద్దమవుతున్నారట. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నారట. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసుకున్నట్లు, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. మరి ఓల్డ్ కాంబినేషన్స్ తో వస్తున్న త్రిష ఎంత వరకు ఆకట్టుకుంటారో చూడాలి.