జయలలిత బయోపిక్ ‘తలైవి’ – ఫస్ట్‌లుక్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను ‘తలైవి’ ఫస్ట్ లుక్ రిలీజ్ ..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను ‘తలైవి’ ఫస్ట్ లుక్ రిలీజ్ ..
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను ‘తలైవి’ పేరుతో తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. లెజెండరీ తమిళనాడు దివంగత రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో ప్రముఖ నటుడు అరవిందస్వామి నటిస్తున్నారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. శనివారం ‘తలైవి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
Read Also : పూజా పాప ఫాలోయింగ్ పెరిగిందిగా!
కటౌట్‌లో ఉన్న కంగనాను చూస్తుంటే అచ్చు అమ్మని చూసినట్టే ఉందంటున్నారు తమిళ ప్రజలు. కంగనా జయలలితగా బాగా మేకోవర్ అయ్యారు. సినిమాను 2020 జూన్ 26న విడుదల చేయనున్నారు.‘బ్లేడ్ రన్నర్’, ‘కెప్టెన్ మార్వెల్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కంగనా రనౌత్‌ను ప్రత్యేక మేకప్‌తో జయలలితగా చూపిస్తున్నారు.. ఈ సినిమా కోసం కంగనా భరతనాట్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంది. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు.