జయసుధకు అభినవ మయూరి బిరుదు

  • Publish Date - September 3, 2019 / 09:21 AM IST

ప్రతీ సంవత్సరం ప్రముఖులకు బిరుదులు ఇచ్చినట్లుగానే 2019 సంవత్సరం కూడా టీ సుబ్బిరామిరెడ్డి తన పుట్టిన రోజు(17 సెప్టెంబర్ 2019) నాడు సహజనటి జయసుధకు అభినవ మయూరి బిరుదు ప్రధానం చేస్తున్నారు. ఈ సంధర్భంగా మాట్లాడిన సుబ్బిరామిరెడ్డి, ఈసారి ఆశా భోంస్లే, అక్కినేని నాగేశ్వరరావు, జయప్రధ, జేసుధాసు, మోహన్ బాబు ఇలా ఎందరికో బిరుదులు ఇచ్చినట్లే.. సెప్టెంబర్ 17వ తేదీన 300లకు పైగా 46ఏళ్ల పాటు అనేక సినిమాల్లో నటించిన జయసుధకు అభినవ మయూరి బిరుదు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన జయసుధ..  ఇండస్ట్రీలో నాకు బ్రదర్స్ అంటే మురళీ మోహన్ ఒకరు.. మోహన్ బాబు మరొకరు.. ఎక్కువ సినిమాలు వాళ్లతో నటించానని అందుకే వాళ్లు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని సహజనటి జయసుధ అన్నారు. అవార్డులు అందుకునే వాళ్లు ఫంక్షన్ లకు రారు కానీ అలా ఉండకూడదని, ఫంక్షన్ విశాఖపట్నంలో జరుగుతుంది. సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు సంధర్బంగా తనకు బిరుదు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.

ఇప్పుడు ఫంక్షన్ లు చేస్తున్న కొందరు కొత్త జనరేషన్ వ్యక్తులను మాత్రమే పబ్లిసిటీ కోసం పిలుస్తున్నారని, టీఎస్ఆర్ మాత్రం ప్రస్తుతం ఉన్న జనరేషన్ ని కాకుండా పాతవాళ్లను కూడా ఆహ్వానిస్తారని, ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తారని ఆమె అన్నారు. ఫంక్షన్ విశాఖ పట్నంలో జరుగుతుందని, టీఎస్ఆర్ గారు ఇలాగే ఇంకా ఎన్నో ఏళ్లు ఇలా అవార్డు ఫంక్షన్ లు జరపాలని అన్నారు.

కళాకారులు అంటే టీఎస్ఆర్ గారికి చాలా గౌరవం.. అందుకే ఆయన సీనియర్లు అందరినీ అవార్డుల ఫంక్షన్ కి పిలుస్తారని, ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు అవార్డులు పక్కనపెట్టేశాయని అన్నారు జయసుధ. నంది అవార్డులను ప్రభుత్వాలను పూర్తిగా పక్కన పెట్టేశాయని, మేము ఎన్నో మంచి పనుల్లో పాల్గొంటామని, అయితే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయానా టీఎస్ఆర్  మాత్రం ఖచ్చితంగా అవార్డులు ఇస్తారని, ఆయన ఇలాగే ఎప్పుడూ ఇవ్వాలని ఆమె అన్నారు.