JD Chakravarthy
JD Chakravarthy : నటీనటులు తమ యాక్టింగ్ ని చూపించుకోడానికి, నటన మీద తమకు ఉన్న ప్యాషన్ ని నిరూపించుకోడానికి ఎలాంటి సీన్ అయినా చేస్తారు. డైరెక్టర్ చెప్తే ఏం చేయడానికి అయినా వెనుకాడరు. అయితే సినిమాల్లోనే కాదు బయట కూడా కొంతమంది ఛాన్సుల కోసం, తామేంటో నిరూపించుకోడానికి డైరెక్టర్ ఏం చెప్పినా చేస్తారు. అలా నటుడు JD చక్రవర్తి ఓ సంఘటన గురించి చెప్పాడు.
JD చక్రవర్తి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెమెరా ముందు నేను ఏం చేయడానికి అయినా రెడీ. నాకు కృష్ణవంశీ లైఫ్ ఇచ్చాడని తెలుసు. కానీ గులాబీ సినిమా కంటే ముందు నుంచే కృష్ణవంశీ నాకు తెలుసు. ఆర్జీవీ దగ్గర్నుంచి మేము ఇద్దరం క్లోజ్. గులాబీ సినిమా ముందు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ బయట నేను కృష్ణవంశీ మాట్లాడుకుంటున్నాము. కృష్ణవంశీ యాక్టర్ అంటే ఎలా ఉండాలంటే, అతనిలో ఎంత ఇంటెన్స్ ఉండాలంటే డైరెక్టర్ ప్యాంట్ తీసి లో అండర్ గార్మెంట్స్ మీద పరిగెత్తాలంటే పరిగెత్తాలి అని చెప్పి రోడ్ మీదకు చూసేసరికి ఎవరో అండర్ గార్మెంట్స్ మీద పరిగెడుతున్నాడు అని పక్కన వాళ్లకు చెప్పాడు. చూస్తే అది నేనే. కృష్ణవంశీ మాట కూడా పూర్తి చేయకుండానే నేను ప్యాంట్ తీసేసి పరిగెత్తాను. నాలో అంత కసి ఉంది అని తెలిపాడు.
Also Read : Premanand Ji Maharaj : స్వామిజీకి కిడ్నీ ఇస్తా అన్న హీరోయిన్ భర్త.. షాక్ అయిన హీరోయిన్..
కృష్ణవంశీ, JD చక్రవర్తి ఇద్దరూ ఆర్జీవీ దగ్గర కెరీర్ మొదలుపెట్టిన వాళ్లే. కృష్ణవంశీ దర్శకుడిగా మారాక అప్పటిదాకా చిన్న చిన్న పాత్రలు, విలన్ రోల్స్ చేస్తున్న JD చక్రవర్తిని పెట్టి గులాబీ సినిమా చేసి అందర్నీ మెప్పించాడు. గులాబీ సినిమా JD చక్రవర్తి కెరీర్ ని బాగా నిలబెట్టింది.