Jeedigunta Ramachandra Murthy: కరోనా వైరస్ ప్రపంచాన్ని రోజురోజుకీ కలవరపెడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏదొక రూపంలో సామన్యుల దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కోవిడ్ బాధితులవుతున్నారు.
ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడిన కొందరు ప్రముఖులు కోలుకోగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కోవిడ్ కారణంగా ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్ర మూర్తి కన్నుమూశారు.టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్‌కు రామచంద్ర మూర్తి స్వయానా తాత. ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స తీసుకుంటున్న రామచంద్ర మూర్తి మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో వరుణ్ సందేశ్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.