Jeevitha Rajasekhar Wins In Sekhar Movie Issue
Sekhar: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆయన భార్య జీవితా రాజశేఖర్ డైరెక్ట్ చేయగా, గత శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే వారికి ఈ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ చిత్ర ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వర్సెస్ జీవితా రాజశేఖర్ మధ్య ఆర్థికపరమైన వివాదం నెలకొనడంతో, పరంధామరెడ్డి కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ కేసు కారణంగా శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.
Sekhar Movie: రియలిస్టిక్ మూవీగా ‘శేఖర్’.. జీవితా ముచ్చట్లు!
శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ చాలా తీవ్ర నిరాశకు లోనయ్యారు. తాజాగా ఈ వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టు తెలుస్తోంది. ‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారు. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని.. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని న్యాయమూర్తి తెలిపారు.
Jeevitha Rajasekhar : చిరంజీవికి మాకు ఎలాంటి విబేధాలు లేవు.. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు..
ఈ వివాదానికి సంబంధించి జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఇక శేఖర్ సినిమాలో రాజశేఖర్ మాస్ లుక్‌లో కనిపించగా, ఆయన కూతురు శివాని రాజశేఖర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.