Jiah Khan case result announced after 10 years suraj pancholi released from this case
Jiah Khan : బాలీవుడ్(Bollywood) నటి జియా ఖాన్(Jiah Khan) అమితాబ్(Amithab) సరసన నిశ్శబ్ద్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించింది జియా. అయితే 2013 లో జియా తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. జియా ఆత్మహత్య బాలీవుడ్ లో అప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు ఈ ఆత్మహత్య కేసు దర్యాప్తులో జియా ఖాన్ రాసిన ఓ లెటర్ ని తన ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు.
జియా ఖాన్ నటుడు సూరజ్ పంచోలితో ప్రేమలో ఉందని, అతను తనని వేధిస్తున్నాడని, అతనితో చాలా సమస్యలు ఉన్నాయని ఆ లేఖలో రాసింది. దీని ఆధారంగా నటుడు సూరజ్ పంచోలిని అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ అతను.. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలీదు, మేమిద్దరం క్లోజ్ గా ఉండేవాళ్ళం, ఆమె నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి, ఆమెను కోల్పోయాను అంటూ కోర్టులో తెలిపాడు. మొదట సూరజ్ కి బెయిల్ నిరాకరించినా నెల రోజులు జైలు లో ఉన్న అనంతరం కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం.
FilmFare Awards : ఫిలింఫేర్ అవార్డ్స్ 2023 (బాలీవుడ్).. ఫుల్ అవార్డుల లిస్ట్..
అయితే జియా తల్లి తన కూతురు చనిపోయేలా చేశారని, సూరజ్ వల్లే చనిపోయిందని కోర్టుని ఆశ్రయిస్తూ, CBI కి కేసు అప్పగించాలని కోరింది. దీంతో జియా చనిపోయిన సంవత్సరం తర్వాత కోర్టు ఈ కేసుని CBI కి అప్పగించింది. అనేక వాదనలు, ప్రతివాదనలు అయ్యాక పదేళ్ల తర్వాత తాజాగా ఈ కేసులో CBI కోర్టు తీర్పు వెల్లడించింది. సూరజ్ పంచోలికి వ్యతిరేకంగా ఆరోపణలు తప్ప ఎలాంటి బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో సూరజ్ ని నేడు నిర్దోషిగా విడుదల చేసింది CBI కోర్టు.