Samantha : చాన్నాళ్ల త‌రువాత సినీ మీడియా ముందుకు స‌మంత‌.. అలియా కోసం..

బాలీవుడు న‌టీన‌టులు అలియా భ‌ట్‌, వేదాంగ్ రైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ జిగ్రా.

Jigra movie pre releasing event at hyderabad tomorrow

బాలీవుడు న‌టీన‌టులు అలియా భ‌ట్‌, వేదాంగ్ రైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ జిగ్రా. వాస‌న్ బాలా ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మ్ముడు కోసం అక్క చేసే పోరాటం నేప‌థ్యంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం అక్టోబ‌ర్ 11న హిందీతో పాటు తెలుగులోనూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగంగా పెంచింది.

Singham Again : ‘సింగం ఎగైన్’ ట్రైలర్ రిలీజ్.. కాప్ యూనివర్స్.. హీరోలంతా ఒకే సినిమాలో.. రామాయణంతో పోలుస్తూ..

అందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను అక్టోబ‌ర్ 8 (మంగ‌ళ‌వారం) హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు. పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌కు ముఖ్య అతిథులు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, న‌టి స‌మంత‌తో పాటు న‌టుడు రానా కూడా రానున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Dimplee Hyati : ఏనుగు టాటూ వేయించుకొని.. ఏనుగులతో ఆడుకుంటున్న హీరోయిన్..

ఇదిలా ఉంటే.. ఆరోగ్యం కోసం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టివ్ అవుతుంది. చాన్నాళ్ల త‌రువాత ఓ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆమె హ‌జ‌రు అవుతోంది.